తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) పోలింగ్ మొదలవడంతో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్ర వద్ద సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ హాజరై వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.టాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీలు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న ఫోటోలు వీడియోలు పెట్టడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, కీరవాణి, తేజ, శివాజీ రాజా, సుమంత్ ఇలా ఒక్కొక్కరిగా తమ ఓటుని వేసి వస్తున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తన తల్లి షాలిని( Shalini ) , సతీమణి లక్ష్మి ప్రణతితో( Lakshmi Pranati ) కలిసి వచ్చి ఓటు వేశారు.సాధారణ ప్రజలతో పాటు తాను కూడా లైన్ లో నిలబడి వెళ్లి తమ ఓటుని వేసి వచ్చారు.ఈ క్రమంలోనే పోలింగ్ బూత్ వద్ద లైన్ నిలబడిన ఎన్టీఆర్ ని ఫోటోలు, వీడియోలు తీస్తూ మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్ వ్యక్తులు ఉన్నారు.
ఇక వారితో ఎన్టీఆర్ మాట్లాడుతూ.మీరు ఓటు వేయరా.ఇక్కడే ఉంటారా.?అంటూ ప్రశ్నించారు.దీనికి ఒక వ్యక్తి బదులిస్తూ.మీరు ఓటు వేసిన తరువాత వేస్తాము.అయితే అందరూ వేయము సగమే మందే వేస్తాము అంటూ బదులిచ్చారు.అది విన్నా ఎన్టీఆర్.
సగం మంది వెయ్యరా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే వారితో మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ తన ముఖాన్ని చాలా సీరియస్ గా పెట్టారు.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.