Deepthi Sunaina: నీ భర్త పేరేంటి అంటూ దీప్తి సునైనాను ప్రశ్నించిన నెటిజన్.. అదిరిపోయే సమాధానంతో నోరు మూయించిందిగా?

సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలలో కాస్త చనువు దొరికితే చాలు జనాలు తమకున్న అనుమానాలన్నీ ప్రశ్నల రూపంలో అడిగేస్తూ ఉంటారు.ఇక సెలబ్రెటీలు కూడా కొందరు ఓపికగా సమాధానం చెబితే మరి కొంతమంది మళ్లీ అటువంటి ప్రశ్నలు వేయకుండా నోరు మూయిస్తారు.

 Deepthi Sunaina Shocking Reply To Netizen Who Asked Her Husband Name-TeluguStop.com

అయితే ఇప్పుడు దీప్తి సునైనా( Deepthi Sunaina ) కూడా అదే పని చేసింది.ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

దీప్తి సునైనా గురించి సోషల్ మీడియా ప్రియులకు బాగా పరిచయం.ఈమె డబ్స్మాచ్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడి బాగా లైక్స్ సంపాదించుకుంది.తర్వాత ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.ఇక యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ సమయంలోనే తనకు షణ్ముఖ్ జష్వంత్ తో( Shanmukh Jaswanth ) పరిచయం ఏర్పడగా అతనితో కలిసి చాలా వీడియోస్ చేసింది.వారిద్దరి మధ్య ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇక ఆ సమయంలోనే దీప్తికి బిగ్ బాస్ లో( Bigg Boss ) అవకాశం రావడంతో బిగ్బాస్ లో అడుగు పెట్టింది.ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక యూట్యూబ్ లలో షార్ట్ వీడియోస్ చేస్తూ బాగా బిజీగా మారింది.

ఇక షణ్ముఖ్ తో కలిసి చాలా వీడియోస్ చేస్తూ బాగా సందడి చేసింది.అంతేకాకుండా అతనితో కలిసి బుల్లితెరపై పలు షో లలో జంటగా కూడా పాల్గొంది.

అలా కొంతకాలం వీరిద్దరూ ప్రేమలో ఉండగా ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు.

Telugu Bigg Boss, Deepthi Sunaina, Deepthisunaina, Deepti Sunaina, Netizendeepth

తర్వాత షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టగా ఆ సమయంలో వారి మధ్య ప్రేమ ఉందన్న నిజం బయటపడింది.కానీ షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో మరో అమ్మాయితో ప్రవర్తించిన తీరు పట్ల దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పేసింది.ఇక వీరిద్దరూ ఎవరి లైఫ్ వాళ్ళు అన్నట్లుగా బ్రతుకుతున్నారు.

అంతేకాకుండా ఇద్దరు తమ తమ ప్రాజెక్టులతో బాగా బిజీ అవుతున్నారు.

Telugu Bigg Boss, Deepthi Sunaina, Deepthisunaina, Deepti Sunaina, Netizendeepth

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తను దిగిన ఫోటోషూట్లను బాగా షేర్ చేసుకుంటూ తన అందాలతో కన్నార్పకుండా చేస్తుంది.తనకు ఖాళీ సమయం దొరికితే ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.

అయితే తాజాగా తన ఫాలోవర్స్ తో మరోసారి ముచ్చట్లు పెట్టింది.ఇక అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

Telugu Bigg Boss, Deepthi Sunaina, Deepthisunaina, Deepti Sunaina, Netizendeepth

అందులో ఓ నెటిజన్ మీ హస్బెండ్ పేరేంటి( Husband Name ) అని అడగటంతో వెంటనే మా ఆయన అంటూ మళ్లీ ఎటువంటి ప్రశ్న వేయకుండా అదిరిపోయే సమాధానంతో ఆ నెటిజన్ కి నోరు మూయించింది.ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.ఇక రీసెంట్ గా తను ఒక వీడియో ఆల్బమ్ లో చేయగా అది త్వరలో రిలీజ్ కానుంది.వెండితెరపై అవకాశాలు అందుకోకున్నా కూడా యూట్యూబ్ ద్వారా మాత్రం కెరీర్ ను ముందుకు తీసుకెళుతుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube