డాన్సింగ్ డాక్టర్.. ఈయన రూటే సెపరేటు!

మందులే కాదు ప్రకృతి వైద్యం కూడా అవసరమే అని గుర్తిస్తున్నారు నేటి తరం వైద్యులు.పేషంట్లు తమ బాధలను, భయాలను మరిచేందుకు డాన్స్ చేస్తూ వైద్యం చేస్తూ ఆహా అనిపిస్తున్నారు.

 Dancing Doctor He's Route Separate , Dancing Docter, Charges, Latest News, Vir-TeluguStop.com

రాజస్థాన్​లోని జోధ్​పుర్​కు చెందిన వైద్యులు రాజ్​ ధారీవాల్​ కూడా ఈ కోవకు చెందిన వారే.నృత్యం చేస్తూ.

చిన్నారులను నవ్విస్తూ వారికి చికిత్స అందిస్తున్నారు.ఇలా 71 ఏళ్ల వయసులోనూ తన నృత్యాలతో చిన్నారులను ఉత్సాహ పరుస్తూ.

డ్యాన్సింగ్​ డాక్టర్​గా పేరుగాంచారు.

రోగుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టి వారిలో చైతన్యం నింపడానికి ఇప్పటికే మ్యూజిక్‌ థెరపీని చాలా మంది వైద్యులు వాడుతున్నారు.

రోగుల ఎదుట సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు.ఇలా చేయడం ద్వారా బాధితుల్లో ఉన్న మానసిక ఆందోళన తగ్గి వారిలో స్థైర్యం పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు.

అలాంటి దారిలోనే వెళ్తున్నారు రాజస్థాన్​లోని జోధ్​పుర్​కు చెందిన డాక్టర్ రాజ్​ ధారీవాల్​.తనదైన శైలిలో రోగులకు చికిత్స అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.తన వద్దకు వచ్చే వారికి నృత్యాలు చేయమని సూచిస్తుంటారు.వారితో పాటు కాలు కదుపుతారు కూడా.

ఓ వైపు డ్యాన్స్​ చేస్తూనే.వైద్యం అందించటం ఆయన ప్రత్యేకత.

వైద్యం చేసేటప్పుడే కాకుండా వివాహ వేడుకల్లో వేదికల పైన సైతం నృత్యాలు చేస్తుంటారు చేస్తుంటారు డాక్టర్​ ధారీవాల్​. ప్రతిరోజు నృత్యం చేస్తానని, దాని వల్లే తన శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

ఆయన డ్యాన్స్​కు సంబంధించిన ఓ వీడియో ఇటీవల వైరల్​గా మారింది.అందులో ఓ పాత సినిమా పాటకు ఆయన పెళ్లి వేదికపై నృత్యం చేశారు.ప్రతి రోజు ఉదయపు నడక, వ్యాయామం, యోగాలతో పాటు ఒక గంట పాటు నృత్యం చేస్తానని చెబుతున్నారు ధారీవాల్.డాక్టర్​ ధారీవాల్​కు ముగ్గురు కుమారులు.

వారంతా ఐఐటీల్లో చదివారు.తన కోడలితో పాటు కుటుంబ సభ్యులు మొత్తం తమ నిత్యజీవితంలో డ్యాన్స్​ను ఒక భాగం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube