వ్యవసాయం లో అత్యంత కీలకమైన వానాకాలం సీజన్ కు సంబంధించి రుణాల విషయంలో తెలంగాణ లో బ్యాంకు ఉదాసీనత వైఖరి ఆవలంబిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు.సోమవారం ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్ లో జరిగిన జిల్లా ముఖ్యుల సమావేశం లో మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల మేరకు ప్రధానంగా సన్న,చిన్నకారు రైతులకు రుణాలు అందించడం లో బ్యాంకులు లక్ష్యాలను చేరుకోవడం లేదని విమర్శించారు.
బ్యాంకుల నుండి అన్నదాతలకు సహకారం నామమాత్రంగానేఉందన్నారు.ప్రస్తుతం వానాకాలం సీజన్ లో రైతులకు పంట రుణాలు ఇవ్వడం లో బ్యాంకులు మొండి చెయ్యి చూపుతున్నాయని ఆరోపించారు.
జిల్లాల్లోలీడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో జిల్లా రుణం ప్రణాళికలు ఆమోదించడం లో మరింత తీవ్ర జాప్యం అవుతుందని అన్నారు.
రెండు నెలల అయిన జిల్లా రుణ ప్రణాళికలు ఖరారు కాకపోవడంతో రైతులకు రుణాలు అందడం లేదన్నారు.
ఈ పరిస్థితుల్లో రైతులకు సాగు పెట్టుబడి ఖర్చులు కోసం అధిక వడ్డిలకు ప్రైవేటు అప్పులు తప్పడం లేదన్నారు.వరి,పత్తి లాంటి ఎ పంటలు సాగు చేయాలన్నా ఎకరానికి 40వేలు మించి పెట్టుబడి అవుతుందని, ప్రభుత్వం రైతు బంధు పేరిట 5వేలు మాత్రమే ఇవ్వడం తో సాగు పెట్టుబడి ఖర్చులు కోసం అధిక వడ్డిలకు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు వద్ధ అప్పులు చేస్తున్నారు.
ఫలితంగా రైతు లు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రం, జిల్లా కమిటీ సభ్యులు విష్ణు, జిల్లా నాయకులు యస్.కె.మీరా, బత్తిని ఉపేందర్, నాగమణి,పడిగిల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.