కరోనా( Corona ) తరువాత చాలా మారిపోయింది.ముఖ్యంగా విదేశాలకు వెళ్ళినవారు అనేక జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి.
అనేక నియమనిబంధనల నడుమ వెళ్లాల్సిన పరిస్థితి.మరీ ముఖ్యంగా అమెరికా( America ) వెళ్లాలనుకునేవారు తగినన్ని రూల్స్ పాటించేవారు.
అయితే ఇపుడు అలాంటి అవసరమే లేదు.తాజాగా అమెరికా పయనించేవారికి కోవిడ్ వ్యాక్సిన్( Covid Vaccine ) తప్పనిసరి కాదంటూ అమెరికా స్పష్టం చేసింది.
బిడెన్( President Joe Biden ) వైట్ హౌస్ సాక్షిగా కోవిడ్ వ్యాక్సిన్ అవసరాలను తొలగించారు.ఈ నేపథ్యంలో యుఎస్‌కి వెళ్లే ఫెడరల్ ఉద్యోగులు, ఫెడరల్ కాంట్రాక్టర్లు, విదేశీ విమాన ప్రయాణికులకు వ్యాక్సిన్ కు సంబంధించి మే 11తో కొత్త నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
ఈ విషయమై వైట్ హౌస్ కోవిడ్-19 కోఆర్డినేటర్ ఆశిష్ ఝా మాట్లాడుతూ, “ఈ టీకా ఆదేశాలు అనేవి ప్రయాణికులకు మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తాయని నమ్ముతున్నాను.ఐతే కొత్తగా కోవిడ్ సమస్యగా మిగిలిపోయింది.ఈ తరుణంలో ఈ నిబంధనని సవరించడం తప్పనిసరి.” అని చెప్పుకొచ్చారు.అంతర్జాతీయ ప్రయాణీకుల టీకాల అవసరాన్ని తొలగించడం వల్ల విదేశాల నుంచి USలోకి ప్రవేశించే కొత్త వేరియంట్ ప్రమాదాన్ని పెంచుతుందనే ఆందోళనలను ఝా ఈ సందర్భంగా తోసిపుచ్చారు.
ఇకపోతే, జో బిడెన్ ఇప్పటికే యుఎస్ పౌరులు, యుఎస్‌కు ప్రయాణించే విదేశీ ప్రయాణికుల కోసం వైరస్ పరీక్ష అవసరాలను వెనక్కి తీసుకోవడం జరిగింది.విమాన వ్యర్థ జలాల్లోని వివిధ వైరస్ జాతుల కోసం పరీక్షించే ప్యాసింజర్ జెనోమిక్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా US ఇప్పటికే రక్షించబడిందని ఝా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.అమెరికాలో కొత్త వేరియంట్ గాని కనిపిస్తే మేము బాగా గుర్తించగలమని, ఆ తరువాత దానిని మేము సమర్థవంతంగా ప్రతిస్పందించగలమని భావిస్తున్నట్లు వెల్లడించారు.