కోవిడ్ హస్పటల్లో లంచావతారులు.. ఐసీయూ బెడ్లు కావాలంటే చెల్లించాలట ముడుపులు.. ?

లంచం లేనిదే మనదేశంలో పనులు ముందుకు సాగవని అడుగడుగున ఎదురవుతున్న ఘటనలు నిరూపిస్తున్నాయి. అమ్మ పాలను కూడా అంగట్లో అమ్ముకునే కల్తీ నా కోడుకులున్న ఈ సమాజంలో ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడుతున్న వారే కనిపిస్తారు.

 Covid Hospital Doctor Takes Rs 3 Lakh Bribe For Icu Beds Maharastra, Thane, Covi-TeluguStop.com

ఇక ముఖ్యంగా కరోనా< తన ప్రతాపాన్ని ప్రజలపై చూపిస్తూ మారణహోమం సృష్టిస్తుంటే సమయానికి వైద్యం అందక, ఒకవేళ వైద్యం అందిన ఆ ఖర్చు భరించలేక, ఇలా బ్రతక లేక చస్తున్న వారే అధికంగా ఉన్నారు.అందులో పేదరికం కూడా శాపంగా మారింది.

ఇలాంటి దుర్బర పరిస్దితుల్లో మహారాష్ట్రలో కొంద‌రు వైద్యులు బెడ్లు కేటాయించాలంటే లంచం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

థానే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ఓ ఆస్ప‌త్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్ట‌ర్ ప‌ర్వేజ్ అజిజ్ షేక్ అనే అతన్ని ఇద్ద‌రు క‌రోనా రోగులు ఐసీయూ బెడ్ల కోసం సంప్రదించగా, ఈ లంచావతారుడు ఒక్కో బెడ్డుకు 1.5 ల‌క్ష‌ల చొప్పున రెండింటికి కలిపి మూడు లక్షలు ఇవాలని డిమాండ్ చేశాడట.

ఇక ఈ విషయం కాస్త ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ దృష్టికి వెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన చేసిన దర్యాప్తులో డాక్ట‌ర్ ప‌ర్వేజ్ రోగుల నుంచి డ‌బ్బులు డిమాండ్ చేసింది నిజ‌మేన‌ని తేలిందట దీంతో పోలీసులకు ఈ విషయం పై కంప్లైంట్ ఇవ్వగా వారు డాక్ట‌ర్ ప‌ర్వేజ్‌తో పాటు మ‌రో న‌లుగురిపై కేసు న‌మోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube