ఈ భూమి మీద పేరుకు మనుషులుగా బ్రతుకుతున్నాం గానీ, అడవిలో జంతువులే నయం.ఎలాంటి కల్మషం లేకుండా, కుట్రలు కుతంత్రాలకు దూరంగా జీవిస్తాయి.
వాటికి అంటూ ముట్టు అంటూ నియమాలేవి ఉండవు.కానీ మనుషులుగా పుట్టిన మనకు ఎన్నో ఆంక్షలు.
ఇక మనిషిలో అవయవాలన్ని బాగున్నంత వరకు అవసరాలు తీర్చుకుంటారు.ఏదైనా రోగం రాగానే చీ అంటూ కసిరించుకుంటారు.ఈ భర్త కూడా తన భార్యకు కరోనా వచ్చిందని బాత్రూంలో ఉంచాడు.ఇంట్లోని మరుగు దొడ్డిని కూడా వాడకూడదని, బయట ఓ గొయ్యి తీసి అక్కడే కాలకృత్యాలు తీర్చుకోవాలని హెచ్చరించాడు.
ఇలా భార్య, భర్తల బంధాన్నే మంట కలుపుతున్న కరోనా లీలలు ఎన్నో ఈ లోకంలో జరుగుతున్నాయి.ఇకపోతే ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని గోపాలవాడలో చోటు చేసుకుంది.
కాగా చివరికి ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో వారు బాధితురాలి భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఇంట్లోనే ఓ గదిని ఏర్పాటు చేశారు.