తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెంచింది.కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన హస్తం పార్టీ తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న అసంతృప్త నేతలతో కాంగ్రెస్ మంతనాలు జరిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు మరో పది మంది ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం.
మరోవైపు ఈ నెలాఖరులో ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.ఈ సభావేదిక పైనే నేతలు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.