పాతోళ్లు వస్తే పార్టీ కొత్తగుంటుందా?

దేశ వ్యాప్తంగా ఓటములతో కాంగ్రెసు పార్టీ దిక్కుతోచకుండా ఉంది.వచ్చే ఎన్నికల నాటికి బలం కూడదీసుకోవాలి.

 Back To Congress Called Digvijay Sing-TeluguStop.com

ఇప్పడైతే కాలూ చేయి ఆడటంలేదు.దేశంలో అన్ని స్థాయిల్లో బాగా బలపడిపోయిన బీజేపీని ఓడించాలంటే ఇప్పుడున్న నాయకులకు శక్తి చాలదు.

అధినేత సోనియా గాంధీకి ఓపికలేదు.అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఎన్నో ఆశలు పెట్టుకున్న యువరాజు రాహుల్‌ గాంధీ ఏమీ పట్టనట్లు ఉన్నారు.ఆయన నాయకత్వం మీద నాయకులకే కాదు ఆయనకూ నమ్మకం లేనట్లుగా ఉంది.

కొత్తగా కాంగ్రెసులో చేరేవారు ఎవరూ కనబడటంలేదు.ఏం చేయాలో దిక్కుతోచని హైకమాండ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ ద్వారా ఓ ప్రకటన చేయించింది.ఏమిటది? ‘కాంగ్రెసు నుంచి వెళ్లిపోయి సొంత కుంపట్లు పెట్టుకున్న పాత నాయకులంతా తిరిగి సొంత ఇంటికి రావాలహో’ అని.ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, తమిళమానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌…ఇంకా ఎవరైనా ఉంటే వారందరూ కాంగ్రెసులోకి వచ్చేయాలట…! పాత వాళ్లతో కొత్త రక్తం ఎక్కిస్తే పార్టీ బలం పుంజుకుంటుందని దిగ్విజయ్‌ సింగ్‌ అభిప్రాయం.కాంగ్రెసుకు రాహుల్‌ గాంధీ అధ్యక్షుడు కాబోతుంటే వీరు వచ్చి కాంగ్రెసులో ఎలా చేరతారు? ఎందుకు పనిచేస్తారు? పిలుపు ఇచ్చారు కదా.చూద్దాం ఎలా స్పందిస్తారో…!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube