బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణలో బీఆర్ఎస్ చెప్తున్నట్లు ఎక్కడా 24 గంటల విద్యుత్ లేదని ఆరోపించారు.
కేవలం 12 లేదా 13 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.రానున్న రోజుల్లో ఈ 12, 13 గంటల్లోనూ కోతలు పెడతారని చెప్పారు.
నల్గొండ అప్పాజీపేటలో వారం రోజుల నుంచి కనీసం ఆరు గంటలు కూడా విద్యుత్ రావడం లేదని తెలిపారు.ఈ క్రమంలోనే పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.24 గంటలు ఇచ్చేంతా కరెంట్ మీ దగ్గర లేకపోతే చెప్పండన్న ఎంపీ కోమటిరెడ్డి పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసైనా ప్రజలకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారన్నారు.
మూడు నెలల తరువాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో కనీసం నెల రోజులైనా 24 గంటల కరెంట్ ఇవ్వండని తెలిపారు.