పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ బూత్ లెవల్ మీటింగ్( Congress Booth Level Meeting ) జరగనుంది.హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.
రేపు జరగనున్న బూత్ లెవల్ మీటింగ్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ నేపథ్యంలోనే సమావేశం ఏర్పాట్లపై గాంధీభవన్ లో నేతలు చర్చిస్తున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ ముఖ్యనేతలతో ఇంఛార్జ్ దీపదాస్ మున్షీ( Deepa Dasmunshi ) భేటీ అయ్యారు.సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.కాగా బూత్ లెవల్ మీటింగ్ కు సుమారు 35 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.