ఏపీలోని విపక్ష పార్టీ నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబులా ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రమని తాను అననని తెలిపారు.
ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని కూడా తాను అనడం లేదని చెప్పారు.దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని అనలేదని తెలిపారు.
ఇదే తన రాష్ట్రమన్న జగన్ అక్కడే తన రాజకీయమని వెల్లడించారు.ఐదు కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని పేర్కొన్నారు.
ఏపీ ప్రజల సంక్షేమమే తమ విధానమని సీఎం జగన్ తెలిపారు.నాయకులు ఎవరైనా వారికి విశ్వసనీయత ఉండాలని చెప్పారు.
రాష్ట్రంలో మరో 18 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయన్నారు.చంద్రబాబులా తాను దత్తపుత్రుడిని నమ్ముకోలేదన్న జగన్ దేవుడిని, ప్రజలనే తాను నమ్ముకున్నట్లు వెల్లడించారు.