రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధమాకా మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది.క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి.
ధమాకా మూవీ మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు.ఈ సినిమా కేవలం రవితేజ ఫ్యాన్స్ కోసమే అని కొంతమంది క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే శ్రీలీల కెరీర్ కు మాత్రం ఈ మూవీ ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
శ్రీలీల మరో సాయిపల్లవి అవుతుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
శ్రీలీల డ్యాన్స్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ఎలాంటి కఠినమైన స్టెప్స్ అయినా ఆమె అలవోకగా చేసేస్తోందని తెలుస్తోంది.డ్యాన్స్ విషయంలో శ్రీలీల చాలా గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
రవితేజ శ్రీలీల జోడీ బాగానే సూట్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు ఎక్కువగా వినిపిస్తుండటం గమనార్హం.
అయితే ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే ఫస్ట్ వీకెండ్ తర్వాత మాత్రం ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం సాధ్యం కాదని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ధమాకా సినిమా టైటిల్ మెప్పించిన స్థాయిలో సినిమా లేదని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
రవితేజకు ఈ ఏడాది హ్యాట్రిక్ ఫ్లాపులు ఖాతాలో చేరాయి.మాస్ మహారాజ్ రవితేజ ఇకనైనా రెమ్యునరేషన్ కంటే కథలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది.
రవితేజ తర్వాత సినిమాలు కూడా ఫ్లాప్ అయితే ఆయన కెరీర్ కు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.శ్రీలీల కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవడంతో పాటు మరిన్ని రికార్డులను బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.