నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ యువకుడి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

మనలో చాలామంది ఒక ప్రభుత్వ ఉద్యోగం( Govt job ) కోసం పడే కష్టం అంతాఇంతా కాదు.నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే సాధారణమైన విషయం కాదు.

 Chukkala Suryakumar Success Story Details Here Goes Viral In Social Media , Ka-TeluguStop.com

సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చినా చుక్కల సూర్యకుమార్ ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజా సేవ చేయాలని అనుకున్నాడు.తండ్రి హెడ్ కానిస్టేబుల్ కాగా సూర్యకుమార్ ఎంతో కష్టపడి గ్రూప్1( APPSC Group 1 ) ద్వారా డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

Telugu Andhra Pradesh, Appsc, Civils, Kakinada, Suryakumar-Inspirational Storys

కాకినాడ జిల్లా( Kakinada district )లోని పైడికొండ గ్రామానికి చెందిన చుక్కల సూర్యకుమార్ పదో తరగతిలో మంచి మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు.యూనివర్సిటీ స్థాయిలో కూడా చుక్కల సూర్యకుమార్ టాపర్ గా నిలిచారు.బీటెక్ పూర్తైన తర్వాత సూర్యకుమార్( Chukkala suryakumar ) కు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది.ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసిన సూర్యకుమార్ ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ ( Civils )కు జాయిన్ అయ్యారు.

Telugu Andhra Pradesh, Appsc, Civils, Kakinada, Suryakumar-Inspirational Storys

2023 సంవత్సరంలో సూర్యకుమార్ దేవాదాయశాఖలో ఈవో ఉద్యోగానికి ఎంపిక కావడంతో పాటు కాగ్ అకౌంటెంట్ గా ఎంపికయ్యారు.సరదాగా రాసిన గ్రూప్4 జాబ్ తో పాటు గ్రూప్1లో ర్యాంక్ సాధించారు.డీఎస్పీ( DSP ) అయినప్పటికీ రాబోయే రోజుల్లో సివిల్ సర్వీసెస్ సాధించాలనే లక్ష్యాన్ని కొనసాగిస్తానని సూర్యకుమార్ వెల్లడించడం గమనార్హం.మన సామర్థ్యానికి అనుగుణంగా లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూర్యకుమార్ పేర్కొన్నారు.

న్ని సాధించడానికి కష్టపడటం తప్ప మరో మార్గం లేదని సూర్యకుమార్ చెబుతున్నారు.ఒడిదొడుకులు ఎదురైనా కష్టపడి లక్ష్యాన్ని సాధించాలని సూర్యకుమార్ కామెంట్లు చేశారు.

ఎదురుదెబ్బలు తగిలినా నిరాశ పడకుండా ప్రయత్నించాలని ఆయన అన్నారు.సూర్యకుమార్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సూర్యకుమార్ భవిష్యత్తులో సివిల్స్ కూడా సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారేమో చూడాల్సి ఉంది.సూర్యకుమార్ ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురైనా వెనుకడుగు వేయకుండా ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube