ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలో ఒక్కడిగా ప్రారంభించి మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి ఒక మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి అందించాడు.
ఇలా చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సోదరులు నాగబాబు పవన్ కళ్యాణ్, మేనల్లుళ్లు అందరూ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా గుర్తింపు పొందారు.
అయితే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ మొదట సినిమాలలో అడుగుపెట్టడానికి చిరంజీవికి ఇష్టం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.చిరంజీవి తన కుమారుడిని ఎప్పుడు ఒక డాక్టర్ గా చూడాలని కలలు కన్నాడు.
ఇండస్ట్రీలో ఉన్న ఒడిదుడుకుల గురించి చిరంజీవికి బాగా తెలుసు కాబట్టి రామ్ చరణ్ ని యాక్టర్ గా కన్నా డాక్టర్ గా చూడాలని చిరంజీవి కలలు కన్నాడు.
అయితే రామ్ చరణ్ కి చదువు పట్ల ఆసక్తి లేకపోవడంతో క్రమంగా చిరంజీవి తన కలలను వదిలేసుకున్నాడు.ఇక రామ్ చరణ్ కోరిక మేరకు చిరంజీవి తన కొడుకుని ఇండస్ట్రీలో తన వారసుడిగా నిలబెట్టాడు.ఇక రామ్ చరణ్ కూడా తన తండ్రి గౌరవాన్ని పెంచేలా వరుస సినిమాలలో నటిస్తూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు.
మొత్తానికి డాక్టర్ అయ్యి ప్రజల ప్రాణాలు కాపాడవలసిన రామ్ చరణ్ యాక్టర్ గా మారి ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నాడు.