గత రెండేళ్లుగా ఫుల్ బిజీ... అలా రిలాక్స్ అవుతూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోలు!

మామూలుగా కొందరు హీరోలు వరసగా షూటింగ్ లు, ప్రమోషన్ లతో బిజీబిజీగా గడిపేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే షూటింగ్ లకు కాస్త గ్యాప్ దొరకగానే వెకేషన్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా అలా టాలీవుడ్ లోని పలువురు హీరోలు బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విశ్రాంతి పొందడానికి వెకేషన్ లకు వెళ్లినట్లు తెలుస్తోంది.మరి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ తో కలిసి అమెరికా యూరప్ ప్రదేశాలను సందర్శించడానికి వెళ్లారు.చాలా కాలం తరువాత మెగాస్టార్ తన భార్యతో కలసి వెకేషన్ కు వెళుతున్నట్లుగా పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈనెల 3వ తారీకున అమెరికాకు వెళ్లిన చిరంజీవి ఈ వీకెండ్ లో వెకేషన్ ను ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు చేరుకోబోతున్నట్లు తెలుస్తోంది.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నెల గ్యాప్ లోనే రెండు సార్లు వెకేషన్ కు వెళ్లి వచ్చారు.

Advertisement

ఏప్రిల్ నెల ఆఖరి లో వెకేషన్ కు వెళ్లి మే మొదటి వారంలో తిరిగి వచ్చి సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో పాల్గొన్న మహేష్ బాబు ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్లీ ఫ్యామిలీతో కలిసి యూరప్ వెళ్లినట్లు తెలుస్తోంది.

యూరప్ నుంచి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగులో పాల్గొన బోతున్నారు మహేష్ బాబు.టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా తర్వాత వెకేషన్ ను ఎంజాయ్ చేసి తెలిసింది.అయితే పుష్ప సినిమా పార్ట్-2 ఆరంభం కావడానికి మరి కొంత ఆలస్యం అవుతుంది అని తెలియడంతో మళ్లీ వెకేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్.

కేవలం వీరు మాత్రమే కాకుండా టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఈ విధంగానే సినిమాలో నుంచి కాస్త గ్యాప్ జరగడంతో ఇలా ఫ్యామిలీతో కలిసి వెకెషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు