రష్యా, భారత్‌ చమురు మార్కెట్‌పై మొగ్గు చూపినవేళ చైనా ఉడుక్కుంటోంది?

రష్యా, భారత్ మధ్య వున్న సత్సంబంధాలు ఈనాటివి కాదు.అదేవిధంగా చైనా కూడా రష్యాతో మంచి సంబంధాలను కలిగి వుంది.

 China Not Happy With India Russia Fuel Deal Details, Russia, Bharat, Pm Modi, Nr-TeluguStop.com

అయినా చమురు విషయంలో చైనా కంటే భారతేకే వీలైనంత ఎక్కువగా విక్రయించేందుకు రష్యా మొగ్గు చూపడం విశేషమే.రష్యాకి మరింత లాభదాయకంగా ఉండటంతో భారత్ మార్కట్ వైపు ఆసక్తి కనబరుస్తోంది అని నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి ఒక ఏడాది క్రితం దాదాపుగా రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకపోవడం కొసమెరుపు.కానీ ఎప్పుడైతే అమెరికా, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ యుద్ధ కారణంగా రష్యాపై ఆంక్షలు విధించాయో అప్పుడే భారత్ రష్యాకి కీలకమైన మార్కెట్ మారింది.

Telugu Bharat, China, India, India Fuel, India Russia, Latest, Pm Modi, Putin, R

ప్రస్తుతం చైనా కూడా కరోనా ఆంక్షలను ఎత్తేసి రష్యా చమురుని ఎక్కువ కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తోంది.అయినప్పటికీ రష్యా భారత్ మార్కెట్ నే కొనసాగించాలని ఫిక్స్ కావడం ఇపుడు చైనాకు మింగుడు పాడడం లేదు.ఇదిలా ఉండగా.IEA (అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ) ప్రకారం.గత నెలలో, రష్యా చైనాకు రోజుకు 2.3 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును ఎగుమతి చేసినట్టు భోగట్టా.చైనా రష్యా ముడి చమురును కొనుగోలు చేయగలగడమే గాక సొంతంగా షిప్పింగ్ చేయగల సామర్థ్యాం కూడా ఉన్నప్పటికీ రష్యా ఇండియా మార్కెట్ పైన మొగ్గుచూపడం వెనుక రహశ్యం నిపుణులకు కూడా అంతుబట్టడంలేదు.

Telugu Bharat, China, India, India Fuel, India Russia, Latest, Pm Modi, Putin, R

కొంతమంది సదరు ఇరు దేశాల మధ్యవున్న స్నేహ పూర్వక వాతావరణం అని అంటున్నారు.ఇకపోతే భారత్ కి ఓడరేవుల ద్వారా చమురు సరఫరా చేయడానికి తక్కువలో తక్కవ 35 రోజులు పడుతుండగా చైనాకి సుమారు 40 నుంచి 45 రోజుల వరకు పడుతుంది.అంతేకాకుండా పెద్ద మొత్తంలో రష్యా చమురును ఉత్పత్తి చేసే రోనెసెఫ్ట్ పీజేఎస్ నయా ఎనర్జీ లిమిటెడ్ 49.31% వాటాను కలిగి ఉండడం కొసమెరుపు.దీనికి సంబంధించిన షిప్పింగ్ రిఫైనరీ గుజరాత్ లోని వదినార్ లో ఉందనే విషయం తెలిసినదే.

ఇదే భారత్ కి ఉన్న 2వ అతిపెద్ద వెసులుబాటు అయివుంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube