టాలీవుడ్ నటుడు చంద్రమోహన్( Chandramohan ) తాజాగా తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో( health problems ) బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు.
కాగా ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్న విషయం తెలిసిందే.కాగా ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు అభిమానాలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కాగా చాలామంది చంద్రమోహన్ చనిపోవడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో కూడా చంద్రమోహన్ కు సంబంధించి ఎన్నో కథనాలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా చంద్రమోహన్ గురించి ఏఎన్ఆర్( ANR ) చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చంద్రమోహన్ హీరోగా నటుడిగా కొనసాగుతున్న సమయంలో పర్సనాలిటీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారట.ఇదే విషయాన్ని ఆయన ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీలో ఎన్టీఆర్( NTR ) కి అభిమానిని అని చెప్పిన చంద్రమోహన్ ఎన్టీఆర్ తో కంటే ఏఎన్ఆర్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు.
ఇంతకీ చంద్రమోహన్ గారు ఏమన్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.నేను కాలేజీలో ఉండగానే రామారావుగారి అభిమానిని.ఆయనంత అందగాడు ఏ సినీ ఇండస్ట్రీలో ఉండడు అని నా అభిప్రాయం.ఆయన పోషించిన కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు అంటే నాకు చాలా ఇష్టం.
ఈ జన్మలో అలాంటి వేషాలు నేను వేయలేను.
అందుకే ఆ అభిమానం మరింత పెరిగిందేమో.అవకాశాలను బట్టి ఆయనతో కలసి కొన్ని సినిమాలలో నటించాను.అయితే రామారావుగారితో కంటే నాగేశ్వరరావుగారి తోనే ఎక్కువ సినిమాలు చేశాను.
రామారావుగారి డిసిప్లిన్ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం.ఆయనలా ఉండాలని ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు.
అయితే అడుగు ఎత్తు ఎక్కువుంటే నన్ను దాటి వెళ్లిపోయేవాడివయ్యా అని ఏఎన్నార్ అంటూ ఉండేవారు.అలా మరో అడుగు ఎత్తు ఉండుంటే ఇన్ని సినిమాలు చేసేవాడినా అనేది సందేహమే.
రామారావుగారిలా పౌరాణిక వేషాలు వేయాలి, పద్యాలు పాడాలని కోరిక నాకు ఉండేది.కానీ అప్పుడు నిజంగా పర్సనాలిటీ అడ్డం పడింది.
నా పక్కన నటించిన హీరోయిన్స్‌తో కూడా హైట్ పరంగా కొన్ని సమస్యలు వచ్చాయి.అలా ఒక సందర్భం గురించి మాట్లాడుతూ.
యశోదాకృష్ణ సినిమాలో నటిస్తున్నప్పుడు శ్రీదేవి చాలా చిన్న పిల్ల.షూటింగ్ అయ్యాక మద్రాసు తిరిగి వస్తున్నప్పుడు ఒళ్లో పడుకుని నిద్ర పోయేది.
ఆమె నా మొదట్లో నా పక్కన హీరోయిన్‌గా నటించింది.కానీ నా కంటే పొడుగు పెరిగిపోయింది.
మీ పక్కన మళ్లీ ఎప్పుడు హీరోయిన్‌గా చేస్తాను? అనేది కానీ అది జరగలేదు.ఇలా కొన్ని సందర్భాల్లో పర్సనాలిటీ వల్ల ఇబ్బందులు పడ్డాను అని చంద్రమోహన్ తెలిపారు.