గన్ వచ్చే లోపే జగన్ వచ్చి కాపాడుతాడన్న నమ్మకం కావాలి అంటూ అసెంబ్లీలో దిశ ఘటనపై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా వీరావేశంతో ప్రసంగించారు.జగన్ కూడా ఈ ఘటనపై సీరియస్‌గానే స్పందించి వెంటనే కొత్త చట్టం అమల్లోకి తీసుకొచ్చారు.
అత్యాచార బాధితులకు మూడు వారాల్లోనే న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కానీ ఆయన మాటలకు, చేతలకు అసలు పొంతనే లేదని అంటున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.ఈ చట్టం తీసుకొచ్చిన రోజే గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగితే ఇప్పటి వరకూ ఆ చట్టం ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.సోమవారం బాలిక చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
బాధితురాలు దళితురాలనా లేక నిందితుడు రెడ్డి అని చర్యలు తీసుకోవడం లేదా అంటూ ముఖ్యమంత్రిని చాలా ఘాటుగా ప్రశ్నించారు.గుంటూరులో ఐదేళ్ల పాపపై అత్యాచారం చేసిన వ్యక్తి పేరు లక్ష్మారెడ్డి.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోనూ కరుణాకర్‌రెడ్డి అనే వ్యక్తి ఓ బీసీ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ రెండు ఘటనల్లోనూ ప్రభుత్వం దిశ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ బాబు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిది స్ప్లిట్ పర్సనాలిటీ.ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదు.దిశ చట్టం తెచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నా ఒక్క కేసులోనూ ఈ చట్టాన్ని అమలు చేయలేదు.గుంటూరులో ఐదేళ్ల పాపపై అత్యాచారం జరిగితే కనీసం పరామర్శించలేదు.
దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తే కేసీఆర్‌ను తెగ పొగిడిన జగన్.ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చంద్రబాబు నిలదీశారు.
గుంటూరు కేసులో అయితే నిందితుడు లక్ష్మారెడ్డి తండ్రి వైసీ
.