దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్.ఆ పేరు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనే కాకుండా.దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం.ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మది నెలల్లోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు.దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకలించి వేశారు.అప్పటి వరకు ఓ సినిమా నటుడిగానే ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే ఓ ప్రభంజనం క్రియేట్ చేశారు.
ప్రపంచ చరిత్రలోనే ఎన్టీఆర్‌కు ఉన్న రికార్డు మరే నేతకూ లేదనే చెప్పాలి.
ఇక ఎంతో మంది కొత్త వాళ్లకు రాజకీయ అవకాశాలు వచ్చింది ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటుతోనే.
బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు.రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా ఆయనదే.
అలాంటి ఎన్టీఆర్ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాత్రం ఓ రాజకీయ అవసరం మాత్రమే అని చెప్పాలి.చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు.
ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తొమ్మిదేళ్ల పాలనలో ఎన్టీఆర్ పేరు చెరిపేసేందుకే ప్రయత్నించారు.

పార్టీ ఎప్పుడు అయితే ఓడిపోయిందో అప్పటి నుంచి ఎన్టీఆర్ బొమ్మ వాడమని ఆదేశించారు.చివరకు ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆదుకుంటున్నానన్న బిల్డప్ కోసమే హరికృష్ణను రాజ్యసభకు పంపారు.ఆ తర్వాత బాలయ్యకు హిందూపురం సీటు ఇచ్చి సైడ్ చేసేశారు.
కనీసం నందమూరి కుటుంబానికి ఓ మంత్రి పదవి ఇవ్వకుండా తన కుమారుడు లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు.అయితే లోకేష్ చివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు.
ఇక అధికారంలో ఉండగా ఆయన ఎప్పుడూ ఎన్టీఆర్ ఘాట్‌కు రారు ఎన్టీఆర్ పేరు కూడా ఆయనకు గుర్తు ఉండదు.
ఎంత సేపు తాను మాత్రమై హైలెట్ అయ్యేలా చేసుకుంటారు.
కానీ ఎప్పుడు అయితే పార్టీ ఓడిపోతుందో అప్పుడు మాత్రం ఆయనకు సడెన్‌గా ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేస్తారు.ఇక రాష్ట్ర విభన తర్వాత అమరావతికి వెళ్ళాక చంద్రబాబునాయుడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరు కావటం కూడా మానేశారు.
అలా ఆయనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నారు.