కుక్కను ప్రాణాపాయం నుంచి కాపాడిన పిల్లి.. వీడియో వైరల్...

ఒక్కోసారి ఊహించని మార్గాల్లో ప్రాణాపాయం తలెత్తుతుంది.సిద్ధంగా లేనప్పుడు వీటినించి బయటపడే ఛాన్స్ చాలా తక్కువ.

 Cat Saves Dog’s Life By Chasing Off Coyotes,dog, Family Cat, Coyote Attack, Vi-TeluguStop.com

కానీ కొన్నిసార్లు ఆపద్బాంధవులుగా కొందరు మృత్యువు నుంచి కాపాడతారు.అయితే తాజాగా ఓ కుక్కకు ఓ పిల్లి ఆపద్బాంధవుడిగా నిలిచింది.

పిల్లి పుణ్యమా అని రెండు కొయెట్‌ల దాడుల నుంచి ఆ కుక్క ఊహించిన విధంగా ప్రాణాలతో బయటపడింది.ఈ కుక్క పిల్లితో కలిసి ఓక్లహోమాలోని ఎడ్మండ్‌లో ఓ ఇంటిలో నివసిస్తోంది.

ఒకరోజు వాటి ఇంటి పెరట్లోకి ప్రవేశించిన కొయెట్‌ కుక్కపై దాడి చేసింది.

ఆ కుక్క పేరు ఓక్లీ, అది 6 ఏళ్ల వైట్ హవానీస్ డాగ్( Havanese Dog ). ఈ కుక్క బొమ్మలా కనిపించే చిన్న, సున్నితమైన కుక్క.కొయెట్లు తోడేలు లాగా ఉంటాయి కానీ వాటికంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి.

కుక్క యజమాని లేన్ డయ్యర్ నవంబర్ 30వ తేదీ రాత్రి మూత్ర విసర్జన చేయడానికి కుక్కను బయటికి పంపారు.సమీపంలో ఒక కొయెట్ దాక్కున్నట్లు కుక్క చూడలేదు.

చీకట్లోంచి మరో కొయెట్ కూడా వచ్చింది.అవి రెండూ ఓక్లీపై దూకి దానిని చంపేందుకు ప్రయత్నించాయి.

డయ్యర్‌కు మరో రెండు పెద్ద కుక్కలు ఉన్నాయి, కానీ అవి కెమెరా దృష్టిలో లేవు.అవి ఓక్లీని కాపాడటానికి రాలేదు.

అదృష్టవశాత్తూ, డయ్యర్ పెంచుకుంటున్న నల్ల పిల్లి బిన్క్స్ కుక్కకు ఏమి జరుగుతుందో చూసి, రక్షించటానికి వచ్చింది.బిన్క్స్ క్యాట్ చాలా ధైర్యవంతురాలు, తెలివైనది.అది కుక్కపై దాడి చేస్తున్న కొయెట్ల వైపు మెరుపు వేగంతో పరిగెత్తింది, వాటిని భయపెట్టింది.అది ఓక్లీని ఆ అడవి జంతువులు తీవ్రంగా గాయపరచకుండా కాపాడింది.

ఏం జరిగిందో చూసి డయ్యర్ షాక్ అయ్యారు.అతను ఈ కథనాన్ని KFOR-TV అనే స్థానిక వార్తా స్టేషన్‌కి చెప్పారు.కొయెట్లు కుక్క ఛాతీపై, ఇతర భాగాలను కొరికేసయని, దాని వల్ల రక్తం కారిందని, సహాయం కోసం ఓక్లీని నీల్ వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వెల్లడించారు.దాడి కారణంగా ఓక్లీ ఒక కాలు కోల్పోయే అవకాశం ఉందని వైద్యులు తెలిపారని కానీ తన వంతు ప్రయత్నంగా దీని కాలు గాయాలను కుట్టారని, దాని వల్లే కుక్క కాలును కోల్పోలేదని చెప్పాడు.

డయ్యర్ దాడికి సంబంధించిన వీడియోను తర్వాత చూశారు.బిన్క్స్ క్యాట్ ఓక్లీని ఎలా కాపాడిందో చూసి ఆశ్చర్యపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube