క్యాన్సర్ ని జయించి షూటింగ్ లో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ నటుడు!

బాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్.కెరియర్ లో ఇండియన్ భాషలతో పాటు, హాలీవుడ్ కూడా నటించి తన సత్తా చాటిన బాలీవుడ్ స్టార్ హీరో ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడ్డాడు.

 Cancer Survivor Irrfan To Start Shooting Hindi Medium Sequel-TeluguStop.com

దీంతో వెంటనే అప్రమత్తమై ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెట్టాడు.ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్స్ లో చాలా మంది ఇలాగే క్యాన్సర్ బారిన పడి మరల ప్రాణాలతో బయట పడ్డారు.

రీసెంట్ గా స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని ఇండియాకి తిరిగి వచ్చింది.

ఇదిలా వుంటే తాజాగా ఇర్ఫాన్ ఖాన్ కూడా క్యాన్సర్ ని జయించి ఇండియా తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది.

ఇక ఆయన క్యాన్సర్ బారిన పడటం వలన మధ్యలో ఆగిపోయిన హిందీ మీడియం సీక్వెల్ ని ఇప్పుడు కొనసాగించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.ఇక ఇర్ఫాన్ ఆరోగ్యం బట్టి ఆయన ఎప్పుడు చెబితే అప్పటి నుంచి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి దర్శకుడు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube