కెనడాలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయులు( Indians ) అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇక్కడ ఎంపీలు, కౌన్సిలర్లు, మేయర్లుగా, మంత్రులుగా ఇండో కెనడియన్లు రాణిస్తున్నారు .
తాజాగా కెనడాలోని కీలక నగరం టొరంటో మేయర్ రేసులో భారతీయులు నిలిచారు.ఈ ఏడాది ప్రారంభంలో మేయర్ జాన్( Mayor John ) టోరీ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త మేయర్ కోసం జరగనున్న ఉప ఎన్నికలో 102 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.
వీరిలో ఇండో కెనడియన్లు కూడా వున్నారు.జూన్ 26న మేయర్ పదవికి ఉపఎన్నిక జరగనుంది.
ఇండో గయానీస్ , ఆఫ్రో-బెర్ముడియన్( Indo-Guyanese, Afro-Bermudian ) తల్లిదండ్రులకు జన్మించిన నియా సింగ్( Nia Singh ) భారత సంతతి అభ్యర్ధుల్లో ఒకరు.గతంలో 2018, 2022లలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు.2016లో జమైకన్ కెనడియన్ అసోసియేషన్ నుంచి కమ్యూనిటీ సర్వీస్ అవార్డును అందుకున్నారు నియా సింగ్.2014లో టొరంటో స్టార్ పర్సన్‌గా ఎంపికయ్యారు.అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు గాను ‘‘ఓస్‌గూడే సొసైటీ’’( Osgoode Society ) స్థాపనలో సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు.ఈ సంస్థ అంటారియోలోని పోలీస్ సేవల్లో కార్డింగ్, ఏకపక్ష నిర్బంధాలను సవాల్ చేయడంలో కీలకపాత్ర పోషించింది.
ఇక మేయర్ ఎన్నికల్లో పోటీపడుతున్న మరో వ్యక్తి సందీప్ శ్రీవాస్తవ( Sandeep Srivastava ).ఈయన గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.మేయర్‌గా మరింత స్థిరమైన సంఘాన్ని నిర్మించాలని తాను ఆశిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు.మున్సిపల్ అనుభవం, నైపుణ్యాల ఆధారంగా తాను టొరంటో స్మార్ట్ సిటీని నిర్మించాలని అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
కంపెనీలు, చిన్న వ్యాపారాలకు రివార్డ్‌లు ఇవ్వడం ద్వారా నగరంలో ఉద్యోగ కల్పన చేస్తానని శ్రీవాస్తవ చెప్పారు.
అలాగే హబీబా దేశాయ్, పర్తాప్ సింగ్ దువా( Habiba Desai, Partap Singh Dua ) కూడా మేయర్ ఎన్నికల్లో పోటీపడుతున్నారు.దేశాయ్ 2022 మునిసిపల్ ఎన్నికల్లో స్కార్‌బరో- గిల్డ్‌వుడ్‌లో కౌన్సిలర్ స్థానం కోసం పోటీ చేసి 1000కు పైగా ఓట్లను సాధించారు.మొత్తం టొరంటో మేయర్ ఉప ఎన్నికలకు రికార్డు స్థాయిలో 102 మంది అభ్యర్ధులు నమోదు చేసుకున్నారు.ఇది 2014 కంటే (65 మంది అభ్యర్ధులు) ఎక్కువని టొరంటో సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.2022 మున్సిపల్ ఎన్నికల్లో టొరంటో మేయర్ పదవి కోసం 31 మంది అభ్యర్ధులు పోటీ చేశారు.ఇక తాజా ఉప ఎన్నిక కోసం జూన్ 8 నుంచి జూన్ 13 వరకు ముందస్తు ఓటింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.జూన్ 26న పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు.
మే 12న మేయర్ ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది.