వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్( Priya Prakash Varrier ) ఒరు ఆధార్ లవ్ టైం లో తెలుగు ఛాన్స్ లు వచ్చినా అప్పుడు లైట్ తీసుకుంది కానీ ఆ తర్వాత అదే తెలుగు సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూసింది.టాలీవుడ్ లో అమ్మడు ఒకటి రెండు సినిమాలు చేసినా అవి వర్క్ అవుట్ కాలేదు అందుకే ఆమెని తెలుగు మేకర్స్ లైట్ తీసుకున్నారు.
కానీ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం తెలుగు సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సాయి తేజ్( Sai Dharam Tej ) బ్రో సినిమాలో లక్కీ ఛాన్స్ అందుకుంది అమ్మడు.
సముద్రఖని( Samuthirakani ) డైరెక్ట్ చేసిన బ్రో సినిమా ఈ నెల 28న రిలీజ్ ఫిక్స్ చేశారు.ఈ సినిమా ట్రైలర్ చూస్తే ప్రియా ప్రకాష్ వారియర్ కి పెద్ద పాత్ర ఇచ్చినట్టు అనిపిస్తుంది.సినిమాలో కెతిక శర్మ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.ప్రియా ప్రకాష్ మాత్రం సాయి తేజ్ భార్య పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది.మరి ప్రియా ప్రకాష్ కి ఈ సినిమా అయినా హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.బ్రో సినిమా అటు కెతికకు కూడా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అమ్మడు కూడా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి.ఈ సినిమాతో అయినా కెరీర్ లో తొలి హిట్ కొట్టాలని చూస్తుంది అమ్మడు.