బ్రిటన్ ప్రధాని అదిరిపోయే ఐడియా.. అరటి ఆకుల్లో అధికారులకు భోజనాలు..

బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.పొంగల్ పండుగ పురస్కరించుకొని ప్రధాని రిషి సునాక్ డైనింగ్ స్ట్రీట్ లోని తన నివాసంలో ఉద్యోగులకు సాంప్రదాయ విందు ను ఏర్పాటు చేయించారు.

 Britain's Prime Minister's Favourite Idea Meals For Officials In Banana Leaves,-TeluguStop.com

అరటి ఆకులలో వడ్డించిన భారతీయ వంటకాల ను ఆరగిస్తున్న ఉద్యోగుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.బెల్లం పాయసం, ఇడ్లీ, చట్నీ, అరటి పండ్లను సిబ్బంది ఎంతో సంతోషకరంగా తిన్నారు.

సాంప్రదాయక దుస్తులతో ఒక వ్యక్తి ఇంకాస్త వడ్డించమంటారా అని అధికారులను అడగడం వంటకాలు భలే రుచిగా ఉన్నాయని అధికారులందరూ ప్రశంసించడం జరిగింది.అంతే కాకుండా చేతితో తినే అలవాటు లేక కొందరు ఇబ్బంది పడ్డారని నెటిజెన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఈ విందు సాంస్కృతిక వైవిధ్యానికి పట్టం కట్టినట్లు కనిపిస్తుందని ప్రశంసలు కూడా వచ్చాయి.

ఇంకా చెప్పాలంటే అంతకు ముందు బ్రిటన్ ప్రధాని సంక్రాంతి జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు వెల్లడించారు.ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ పర్వదినం దేశంలోని అనేక కుటుంబాలకు ఎంత విశిష్టమైనదో నాకు తెలుసు.బ్రిటన్ ప్రజలతో పాటు వివిధ దేశాల్లో సంక్రాంతి జరుపుకుంటున్న వారందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆశిస్తున్నా అంటూ ఒక సందేశాన్ని ప్రకటించారు.

రిషి సునాక్ గత సంవత్సరం అక్టోబర్ 24 వ తేదీ బ్రిటన్ ప్రధాని గా బాధ్యతలు తీసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే.బ్రిటన్ పదవి చేపట్టిన మొదటి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ రికార్డు సృష్టించారు.ఏదేమైనా కానీ బ్రిటన్ ప్రధాని చేసిన పనికి మన దేశ ప్రజలందరూ ఆయన్ను ప్రశంసల వర్షంతో ముంచేత్తుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube