విక్రమ్ వేద, జెర్సీ హిందీలో అందుకే డిజాస్టర్లు.. బోనీ సంచలన వ్యాఖ్యలు?

గత కొన్ని నెలల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి వరుస షాకులు తగులుతున్నాయి.సౌత్ సినిమాలు బాలీవుడ్ లో హిట్టైన స్థాయిలో బాలీవుడ్ సినిమాలు సక్సెస్ సాధించడం లేదు.

 Boney Kapoor Sensational Comments About Vikram Veda And Jersey Movies Details He-TeluguStop.com

ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగు వెలిగి వందల కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం ఫుల్ రన్ లో 30, 40 కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా సొంతం చేసుకోలేకపోతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుంది.

అయితే అదే సమయంలో సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేసినా హిందీలో ఆ సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అవుతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

జెర్సీ, విక్రమ్ వేద సినిమాలు హిందీలో రీమేక్ కాగా హిందీలో ఈ సినిమాలు ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమాల ఫలితాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Bollywood, Boney Kapoor, Disaster, Hindi, Jersey, Vikram Vedha-Movie

కొన్ని సౌత్ సినిమాల హిందీ రీమేక్ లు సక్సెస్ సాధించకపోవడానికి కాపీ పేస్ట్ చేయడమే కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.జెర్సీ, విక్రమ్ వేద సినిమాలకు కనీసం టైటిల్స్ ను కూడా మార్చలేదని ఆయన చెప్పుకొచ్చారు.సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేస్తే ఇక్కడి సంస్కృతికి, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు ఉండాలని ఆయన కామెంట్లు చేశారు.
అలా సినిమాలలో మార్పులు చేసి పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కించాలని బోనీ కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

బోనీ కపూర్ చెప్పిన విషయాలు కూడా నిజమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేసే దర్శకులు ఈ విషయాలను గుర్తుంచుకుంటారో లేదో చూడాలి.

బోనీ కపూర్ నిర్మాతగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube