తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ల కంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకువెళ్తు ఉంటారు.ఇక ఇప్పుడు స్టార్ హీరో గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్( Vishwak Sen ) సైతం తనదైన రీతిలో ముందుకు వెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ఇండస్ట్రీలో ఆతనికి మంచి పేరు తీసుకొస్తున్నాయి.అయితే బేబీ సినిమా( Baby Movie ) విషయంలో తను వ్యవహరించిన తీరుకి విమర్శకుల నుంచి ఆయన మీద నెగిటివ్ కామెంట్లు చేశారు.
అయినప్పటికీ తను మాత్రం సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
ఇక రీసెంట్ గా మంగళవారం సినిమా( Mangalavaaram ) సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.ఈయన ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో తనదైన రీతిలో ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నాడు ఇక ఈ సినిమాలో చాలా రగ్గడ్ క్యారెక్టర్ పోషించపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఆయన సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడు అనే విషయం అయితే మనకు చాలా స్పష్టంగ తెలుస్తుంది.
ఇక దానితో పాటుగా సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారుతున్నాడు.ఇక ఇప్పటికి ప్రభాస్ ఆది పురుష్( Adipurush ) సినిమాలో విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు ఇప్పుడు విశ్వక్ సేన్ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర వహిస్తున్నట్లు గా తెలుస్తుంది.ఇక దీంతో తెలుగులో వచ్చే సంవత్సరం మొత్తం సైఫ్ అలీ ఖాన్ సినిమాలే కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి… ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాలు గనక హిట్ అయితే విశ్వక్ సేన్ తనదైన రీతిలో సక్సెస్ సాధిస్తారని ఎంత మాత్రం అతిశయోక్తి లేదు….