ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు హాజరైయ్యారు.
పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.కేంద్ర పథకాలు, బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు అదానీ వ్యవహారంతో పార్లమెంట్ గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.అదానీ వ్యవహారంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.