బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు.పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు ఆయన హస్తినకు వెళ్లారని తెలుస్తోంది.
అయితే తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈటలకు ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది.ఈటలతో పాటు సీనియర్ నాయకురాలు డీకే అరుణకు కూడా పార్టీ అధిష్టానం కీలక పదవి బాధ్యతలు అప్పగించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఈటల ఢిల్లీ పర్యటన పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.