రూ.5కే భోజనం అందిస్తూ వేలమందికి అమ్మగా మారిన బిందు.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో 5 రూపాయలు ఖర్చు చేస్తే చాలా ప్రాంతాలలో టీ కూడా కొనుగోలు చేయలేమనే సంగతి తెలిసిందే.దేశంలోని పలు ప్రాంతాల్లో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి.

 Bindu Ramakant Social Worker Inspiratioanl Story Details, Bindu Ramakant Ghatpan-TeluguStop.com

ఎంతోమందికి కడుపునిండా అన్నం పెడుతూ బిందు రమాకాంత్( Bindu Ramakant ) ప్రశంసలు అందుకుంటున్నారు.ఎంతోమంది ఆమెను ప్రేమగా అమ్మ అని పిలుస్తారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని( Rajasthan ) ఝుంఝునులో బిందు రమాకాంత్ జన్మించారు.బిందు తండ్రి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కావడంతో ఆమె వేర్వేరు ప్రాంతాలలో చదువుకున్నారు.పెళ్లి తర్వాత బిందు భర్తతో కలిసి భోపాల్ లో స్థిరపడ్డారు.మా అబ్బాయి కోల్ కతా ఐ.ఐ.ఎం టాపర్ అని అమ్మాయి దుబాయ్ లో రేడియో జాకీగా పని చేస్తున్నారని బిందు తెలిపారు.సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో ఆకలితో అలమటించే వాళ్లకు అన్నం పెట్టాలని అనుకున్నానని బిందు తెలిపారు.

Telugu Bhopal, Bindu Ramakant, Binduramakant, Rupees, Inspirational-Inspirationa

మొదట ఇంట్లో భోజనం తయారు చేసి రోడ్డు మీద ఆకలితో ఉన్నవారికి భోజనం( Food ) పార్శిల్ ఇచ్చేదానినని బిందు చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఉత్కర్షిణి( Utkarshini ) పేరుతో కిచెన్ ఏర్పాటు చేశానని బిందు తెలిపారు.రోజుకొక మెనూతో ఐదు రూపాయలకే పప్పు, అన్నం అందిస్తున్నామని వెల్లడించారు.

రసగుల్లా, హల్వా పూరీ ఉన్నరోజున మాత్రం 20 రూపాయలకు ప్లేట్ భోజనం అందిస్తున్నామని బిందు పేర్కొన్నారు.

Telugu Bhopal, Bindu Ramakant, Binduramakant, Rupees, Inspirational-Inspirationa

ఎవరైనా ఆకలి వేస్తే భోజనం తిని వెళ్లవచ్చని ప్యాక్ చేసి ఇవ్వడం మాత్రం కుదరదని ఆమె అన్నారు.ఆస్పత్రికి వచ్చే రోగులకు సైతం మా కిచెన్ ఆహార పదార్థాలను అందిస్తోందని బిందు అన్నారు.చాలామంది విద్యార్థులు సైతం ఈ భోజనం తింటున్నారని బిందు రమాకాంత్ అన్నారు.

త్వరలో భోపాల్ లోని( Bhopal ) ఇతర ప్రాంతాలకు సైతం సేవలను విస్తరిస్తానని బిందు తెలిపారు.బిందు చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube