Karthikeya 2 Zee Telugu : ఈ ఆదివారం సాయంత్రం జీ తెలుగులో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం కాబోతున్న 2022 ఏడాదికే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ కార్తికేయ- 2

హైదరాబాద్‌, నవంబర్‌ 15, 2022: జీ తెలుగు అంటేనే నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌.సరికొత్త సినిమాలు, ఆకట్టుకునే సీరియల్స్‌తో ప్రతీవారం తెలుగులో గిళ్లలో వినోదాన్ని అందిస్తూనే ఉంది.

 Biggest Blockbuster Of 2022, Karthikeya 2, Is Coming To Grace Your Tv Screens Th-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సూపర్‌హిట్‌ సినిమాల్ని అందించిన జీ తెలుగు… ఈ ఏడాదిలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కార్తికేయ 2ని ప్రసారం చేయబోతోంది.మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌ మూవీగా రూపొందిన కార్తికేయ- 2 ఈ ఆదివారం, అంటే నవంబరు 20, 2022 సాయంత్రం జీ తెలుగులో ప్రసారం కానుంది.

కార్తికేయ- 2 సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక డాక్టర్‌ చుట్టూ తిరిగే కథ.అనుకోని పరిస్థితుల్లో హీరో కార్తికేయ ద్వారక వెళ్లాల్సి వస్తుంది.అక్కడకు వెళ్లిన తర్వాత కార్తికేయకు ఒక బంగారు కడియం గురించి తెలుస్తుంది.కలియుగంలో రాబోయే వ్యాధుల గురించి, వాటి నివారణ గురించిన సంపూర్ణ సమాచారం ఆ కడియంలో శ్రీకృష్ణ భగవానుడు నిక్షిప్తం చేసి ఉంటాడు.

దాన్ని సాధించే పనిని కార్తికేయ తీసుకుంటాడు.

ఈ క్రమంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆ కడియం కోసం కొంతమంది దుర్మార్గులు కూడా వెతుకుతూ ఉంటారు.మరి ఫైనల్‌గా కార్తికేయ ఆ కండియాన్ని సాధించాడా.? అతడికి అడ్డుపడిందెవరు.? సాయం చేసిందెవరు.? తెలుసుకోవాలంటే కార్తికేయ 2 చూడాల్సిందే.వెండితెరపై సంచలనాలు సృష్టించిన కార్తికేయ 2 సినిమా ఇప్పుడు బుల్లితెరపై కూడా సన్షేషన్‌ క్రియేట్‌ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

విమర్శకుల ప్రశంసలు అందుకున్న కార్తికేయ 2 సినిమా ఇప్పుడు టీవీ స్క్రీన్‌లో అలరించేందుకు సిద్ధమైంది.హీరోగా నిఖిల్‌ సిద్ధార్ధ్‌, హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటించారు.ఇతర పాత్రల్లో అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాసరెడ్డి, హర్ష, ఆదిత్య మీనన్‌ మెప్పించారు.చందు మొండేటి కార్తికేయ 2 సినిమాకు దర్శకత్వం వహించాడు.

ద్వాపర యుగానికి, కలియుగానికి ఉన్న సంబంధం, శ్రీకృష్ణ భగవానుడి గురించిన అద్భుతమైన సందేశం ఈ సినిమాలో ఉన్నాయి.ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది, అదే సమయంలో ఎంటర్‌టైన్‌ కూడా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube