బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ లను, పరిస్థితులను అంచనా వేయడం చాలా కష్టం.ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.
ఒకసారి ఎలిమినేట్ అవుతారు అనుకున్న కంటెస్టెంట్ లు సేఫ్ అవ్వచ్చు, సేఫ్ అవుతారనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వవచ్చు.అలా 12 వ వారంలో రవి ఎలిమినేషన్ ఇటు రవి అభిమానులు, అటు ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది.
దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థమయ్యే ఉంటుంది.
ఇకపోతే యాంకర్ రవి బిగ్ బాస్ లో టాప్ 3 లో ఉంటాడని అనుకున్నారు.
కానీ ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా 12వ వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు రవి.రవి ఎలిమినేట్ అవ్వడానికి నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇదే విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అలాగే కాజల్, సిరి, ప్రియాంక కంటే తక్కువ ఓటు రవికి వచ్చాయన్న విషయాన్ని నమ్మలేకపోతున్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి రవి వచ్చిన తర్వాత 12 వారాలకు కలిపి రవి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.బిగ్ బాస్ షో నిర్వాహకులు బయట రవికి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వారానికి 7 నుంచి 8 లక్షల రూపాయలను ఇచ్చారట.ఆ ప్రకారంగా 12 వారాలకు కలిపి దాదాపుగా 90 లక్షల రూపాయలు వరకు రవి వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.బిగ్ బాస్ విజేతకు అందించే 50 లక్షల రూపాయలు కంటే ఇది ఎక్కువ ఉండటం గమనార్హం.