భోళా శంకర్ ఆరో రోజు కలెక్షన్లు ఇంత ఘోరమా.. మెగాస్టార్ ఖాతాలో జీరో షేర్ అంటూ?

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన మెహర్ రమేష్( Meher Rames ) ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.20 ఏళ్ల సినీ కెరీర్ లో మెహర్ రమేష్ కేవలం ఏడంటే ఏడు సినిమాలను తెరకెక్కించగా కన్నడలో ఈ దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలు సక్సెస్ సాధించాయి.ఆ సినిమాలలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించడం కూడా ఆయా సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.

 Bhola Shankar 6 Days Collectiosn Details Here Goes Viral In Social Media, Bhola-TeluguStop.com

అయితే తెలుగులో మెహర్ రమేష్ బిల్లా సినిమా( Billa movie )తో మాత్రం ఒకే ఒక్క హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.కంత్రి, శక్తి, షాడో, భోళా శంకర్ సినిమాలు మాత్రం నిర్మాతలను ముంచేశాయి. భోళా శంకర్ మూవీ ( Bhola shankar )భారీ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతున్నా గతంతో పోల్చి చూస్తే ఈ సినిమాకు షోల సంఖ్య భారీగా తగ్గింది.

ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోయినా భోళా శంకర్ కలెక్షన్లు పుంజుకోవడానికి అవకాశాలు మాత్రం లేవు.

భోళా శంకర్ సినిమా ఆరో రోజు కలెక్షన్లు కేవలం 30 లక్షల రూపాయలు అని తెలుస్తోంది.పలు థియేటర్లలో ఈ సినిమాకు జీరో షేర్ వచ్చిందని తెలుస్తోంది.జీరో షేర్ అంటే ఈ సినిమాకు కొన్ని థియేటర్ల నుంచి కలెక్షన్లు వస్తే ఆ మొత్తం సరిపోక ఎదురుడబ్బులు ఖర్చు చేసి సినిమాను ఆడించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు ఈ సినిమాకు 26 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది.

ఫుల్ రన్ లో ఈ సినిమా 30 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడం కూడా కష్టమేనని తెలుస్తోంది.

మెగాస్టార్ కెరీర్ లో ఈ స్థాయిలో నష్టాలను మిగిల్చిన మరో సినిమా లేదని సమాచారం అందుతోంది.చిరంజీవి( Chiranjeevi ) సర్జరీ ఇప్పటికే పూర్తి కాగా మరో ఐదారు రోజుల్లో చిరంజీవి హైదరాబాద్ కు తిరిగి రానున్నారని భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube