సోషల్ మీడియాలో వైరల్ అయ్యే డ్యాన్స్ వీడియోలు మనల్ని అబ్బురపరుస్తాయి.కొన్ని వీడియోల్లో కనిపించే వీడియోల్లో చూస్తే మన కళ్ళను మనమే నమ్మలేం.
ఎందుకంటే అవి అంత అద్భుతంగా ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
దీనికి సంబంధించిన వీడియోని ఉష జే అనే డ్యాన్సర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
దీనికి ఇప్పటికే కోట్ల కొద్ది వ్యూస్, మిలియన్ల కొద్దీ లైకులు వచ్చాయి.అప్ రోర్ అనే ఒక ప్రోగ్రాం లో భాగంగా వీరు డ్యాన్స్ చేశారు.
ఆ డ్యాన్స్ ఇప్పుడు విస్తృతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఇంగ్లీష్ పాటకు ముగ్గురు యువతులు వెరైటీగా డ్యాన్స్ చేయడం చూడొచ్చు.
వెరైటీగా అంటే ఈ అమ్మాయిలు భరతనాట్యం, హిప్-హాప్ అనే రెండు డ్యాన్సులను కలిపి ఇంగ్లీష్ పాటకు కాలు కదిపారు.ఇది చూసేందుకు చాలా ఆశ్చర్యంగా అబ్బురంగా అనిపించింది.
ఆఫ్రికన్ అమెరికన్ డ్యాన్స్ అయిన హిప్-హాప్, భారతదేశానికి చెందిన భరతనాట్యంలో వీరు చాలా ప్రావీణ్యం పొందినట్లు కనిపించింది.
“హైబ్రిడ్ భరతనాట్యం అనేది హిప్-హాప్, భరతనాట్యం రెండూ డ్యాన్స్‌లు వేయడం.ఇవి నేను ఇష్టపడే, నేర్చుకునే గౌరవించే 2 నృత్యాలు.ప్రతి డ్యాన్స్ సారాంశాన్ని అలానే ఉంచడం, నేను రెండిటికీ న్యాయం చేసేలా డ్యాన్స్ చేయడం నా లక్ష్యం.” అని నాట్యం చేసిన ఉష జే పేర్కొంది.ఈ వీడియోని చూసి నెటిజన్లు ఇలాంటి డాన్స్ మేము ఎక్కడా చూడలేదని ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.