యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఇందులో ప్రభాస్ ఎలా ఉంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా అలనాటి బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ నటిస్తోంది.
ప్రేమపావురాలు సినిమాలో హీరోయిన్‌గా భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఈ బ్యూటీ ఆ తరువాత మళ్లీ కనిపించలేదు.కాగా ఇప్పుడు మరోసారి తెలుగులో ఎంట్రీ ఇస్తుండటంతో ఈమె పాత్ర గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు చర్చలు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్‌కు తల్లి పాత్రలో భాగ్యశ్రీ అనగానే ఆమె ఫ్యా్న్స్‌తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్‌కు తల్లి పాత్ర అంటే చాలా వయసున్న నటి అయితే బావుంటుందని, అందుకు భాగ్యశ్రీ సూట్ కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
కాగా ఆమె అయితేనే ప్రభాస్ తల్లిగా పర్ఫెక్ట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.మరి ఆమెపై చిత్ర యూనిట్ పెట్టుకున్న నమ్మకానికి ఆమె ఎలాంటి న్యాయం చేస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.