ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనుకుంటున్న హీరోలు సైతం పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో సీనియర్ హీరో అయిన బాలయ్య( Balayya ) మాత్రం తెలుగు కే పరిమితం అవుతున్నాడు.
కారణం ఏదైనా కూడా తను చేసిన ‘డాకు మహారాజ్’( Daaku Maharaaj ) సినిమాని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని తన అభిమానులు కోరుకుంటున్నారు.
నిజానికి ఇంతకుముందు ఆయన చేసిన ‘భగవంత్ కేసరి’( Bhagavanth Kesari ) సినిమాని కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేయాల్సి ఉండాల్సింది.ఎందుకంటే ఆ కంటెంట్ లో అంత దమ్ముంది కాబట్టి దానిని పాన్ ఇండియా లో( Pan India ) రిలీజ్ చేస్తే అయిపోయేది.ఇక దానికి తోడుగా ఇప్పుడు వచ్చిన డాకు మహారాజ్ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయాల్సి ఉంది కానీ చేయలేదు.
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు చేస్తున్న సినిమాలను తెలుగుకే పరిమితం చేయడం వెనుక కారణం ఏంటి.? మార్కెట్ ని విస్తరించుకుంటే ఆయనకే మంచిది కదా అంటూ చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు లాంటి నటుడు గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఇప్పుడు కూడా ఆయన ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.కాబట్టి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలంటే ఇక మీదట ఆయన చేసే సినిమాలు పాన్ ఇండియాలో రేంజ్ రిలీజ్ చేస్తే మంచిదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…చూడాలి మరి బాలయ్య నెక్స్ట్ సినిమాలైనా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతాయా లేదా అనేది…
.