రూ.2 వేల బడ్జెట్ లో చలికాలంలో బెస్ట్ రూమ్ హీటర్స్ ఇవే..!

చలికాలంలో వెచ్చని రూమ్ హీటర్( Room Heater ) కొనాలనుకుంటున్నారా.అయితే రూ.2 వేల బడ్జెట్ లో దొరికే బెస్ట్ రూమ్ హీటర్స్ ఏమో చూద్దాం.

 Best Selling Room Heaters Under Rs 2000 Budget Details, Best Room Heaters , Unde-TeluguStop.com

క్రాంప్టన్ ఇన్ స్టా కంఫీ 800 వాట్ రూమ్ హీటర్:

ఈ హీటర్ లో రెండు అధునాతన క్వార్ట్జ్ ట్యూబ్ ఉంటాయి.ఈ అధునాతన క్వార్ట్జ్ ట్యూబ్ లు( Quartz Tubes ) వేగంగా వేడకుతాయి.ప్రతి ఒక్కటి 400 వాట్స్ శక్తితో ఉష్ణస్థాయిని సర్దుబాటు చేయడానికి అనుమతి ఇస్తాయి.

ఈ హీటర్ అధిక నాణ్యత ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది.ఈ హీటర్ వెచ్చదనాన్ని వేగంగా వ్యాప్తి చేస్తుంది.

బజాజ్ ఆర్ హెచ్ ఎక్స్-2 హాలోజన్ హీటర్:

ఈ హీటర్ లో రెండు హాలోజన్ ట్యూబ్ లు ఉంటాయి.ఇందులో రెండు హిట్ సెట్టింగ్స్ ఉంటాయి.400 వాట్స్, 800 వాట్స్ వినియోగదారులు వారి ప్రాధాన్యత ప్రకారం ఉష్ణోగ్రతను( Temperature ) సర్దుబాటు చేసుకోవచ్చు.అధిక నాణ్యత రిఫ్లెక్టర్ లతో వస్తుంది.

Telugu Bajajrhx, Heaters, Budget Heaters, Cromptoninsta, Havellscozio, Rrcalid-L

ఆర్ ఆర్ కాలిడ్ హాలోజన్ హీటర్:

ఈ హీటర్ 1200 వాట్స్ శక్తితో తగినంత వెచ్చదనాన్ని అందిస్తుంది.180 డిగ్రీల రొటేషన్ ద్వారా గది అంతట ఏకరీతి ఉష్ణవ్యాప్తిని నిర్ధారిస్తుంది.ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది.ఎంత పెద్ద గదైనా కవర్ చేస్తూ వెచ్చదనం అందిస్తుంది.ఈ హీటర్ లో టిప్ ఓవర్ రక్షణ( Tip Over Protection ) ఉంటుంది.పొరపాటున ఎవరైనా ఈ హీటర్ ను తగిలితే ఆటోమేటిక్ గా షట్ డౌన్ అవుతుంది.

Telugu Bajajrhx, Heaters, Budget Heaters, Cromptoninsta, Havellscozio, Rrcalid-L

హవెల్స్ కోజియా క్వార్ట్జ్ రూమ్ హీటర్:

ఈ హీటర్ రెండు క్వార్ట్జ్ హీటింగ్ ట్యూబ్ లతో గది అంతట వెచ్చదనాన్ని వ్యాపింప చేస్తుంది.ఈ హీటర్ లో ప్రత్యేకంగా ఉండే స్టెయిన్ లెస్ స్టీల్ రిఫ్లెక్టర్ హీటర్ తుప్పు పట్టకుండా నిరోధిస్తుంది.అదనపు రక్షణ కోసం టిప్ ఓవర్ సేఫ్టీ స్విచ్ తో వస్తుంది.తక్కువ బడ్జెట్లో రూమ్ హీటర్ కావాలంటే.ఉపయోగించే గది విస్తీర్ణాన్ని బట్టి ఇందులో ఏదో ఒక హీటర్ కొనుగోలు చేసి కావలసినంత వెచ్చదనాన్ని పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube