దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు( Krishnam Raju ) గురించి మనందరికీ తెలిసిందే.కృష్ణంరాజు తెలుగులో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.
అలా ఆయన నటించిన సినిమాలలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా భక్తకన్నప్ప( Bhaktakannappa ).కాగా రౌద్ర పాత్రల్లో అద్భుతంగా నటించే ఆయన నుంచి ఒక భక్తిరస చిత్రం వస్తుందంటే అందరూ ఆశ్చర్యపోయారు.కానీ, ఆ సినిమా విడుదలైన తర్వాత కృష్ణంరాజు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అప్పట్లో కృష్ణంరాజు ఆంగ్ల చిత్రాలు ఎక్కువగా చూసేవారట.మరి ముఖ్యంగా బెన్హార్, టెన్ కమాండమెంట్స్ వంటి సినిమాలను చాలా సార్లు చూశారు.
ఆ స్థాయిలో ఒక పౌరాణిక చిత్రం తెలుగులో తీయాలనుకున్నారు.
అయితే ఈ సినిమా గురించి కృష్ణంరాజు దర్శకుడు బాపు( Director Bapu ) దగ్గరికి వెళ్లి కథను వినిపించగా బాపు ఆ కథలో కొన్ని మార్పులు అవసరం అని సూచించి ఆ బాధ్యతను రచయిత ముళ్లపూడి వెంకటరమణకు అప్పగించారట.అయితే అప్పటికే అనుకున్న కొన్ని సన్నివేశాలకు అదనంగా ఆసక్తికరమైన, ఎమోషనల్ సీన్లతో కొత్త స్క్రిప్ట్ రెడీ చేశారు రమణ.తమ సంస్థ తీసే తొలి పౌరాణిక చిత్రం కావడంతో పూర్తి అవుట్డోర్ లో భారీ ఎత్తున నిర్మించాలని కృష్ణంరాజు అనుకున్నారు.
ఆ విధంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడేంకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బుట్టాయిగూడెం( Buttaigudem ) అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయాలని సంకల్పించారు.దీంతో ఐదెకరాల స్థలం ఎంచుకుని చదును చేయించి పెద్ద సెట్ వేశారు.అందులోనే కీలక సన్నివేశాలను తీశారు.
సినిమాలోని కైలాసం ఎపిసోడ్ తప్ప మిగిలిన సన్నివేశాలను, పాటలను పట్టిసీమ, బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.ఐదు వందలకు పైగా ఉన్న యూనిట్ సభ్యులతో 70 రోజుల పాటు ఏకదాటిగా అక్కడ షూటింగ్ జరిగింది.
వారంలో ఆరు రోజులు మాత్రమే షూటింగ్ చేసి, ఆదివారం అందరికీ సెలవు ఇచ్చేవారు.
ఆ రోజంతా విందులు, వినోదాలతో యూనిట్ సభ్యులు సంతోషంగా గడిపి, మర్నాడు మరింత ఉత్సాహంగా షూటింగ్కు హాజరయ్యేవారు.చిత్రీకరణ జరిగినన్ని రోజులు పెళ్లి భోజనాన్ని తలపించేలా రకరకాల వంటకాలతో యూనిట్ సభ్యులకు చక్కటి విందును అందించేవారు.కాగా భక్తకన్నప్ప కోసం కృష్ణంరాజు ఏకంగా రూ.20 లక్షలు ఖర్చు చేశారట.అయితే ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా కూడా కృష్ణంరాజు మాత్రం వెనక్కి తగ్గలేదట.
ఇందలో రావు గోపాలరావు ఈ సినిమాలో గౌరీనాథ శాస్త్రిగా నటించారు.ఆదినారాయణరావు, సత్యం సంయుక్తంగా సంగీత దర్శకత్వం వహించిన ‘భక్త కన్నప్ప చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.