SAFF ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్..!

దక్షిణాసియా ఫుట్ బాల్ సమాఖ్య శాప్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో భారత్( India ) ఫైనల్ కు చేరింది.తాజాగా లెబనాన్ – భారత్ జరిగిన మ్యాచ్ లో భారత్ 4-2 తో విజయం సాధించి ఫైనల్ కు చేరింది.

 India Has Reached The Final Of The Saff Championship-TeluguStop.com

శనివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతూ అర్థ సమయం ముగిసిన తర్వాత కూడా ఏ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.నిర్ణీత సమయంలోనే కాదు ఎక్స్ ట్రా సమయం లోను ఇరుజట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయకపోవడంతో స్కోరు 0-0 గా నమోదు అయ్యింది.

షూట్ అవుట్ తొలి షాట్ ను ఛెత్రి గోల్ చేయగా.లెబనాన్ ప్లేయర్ హసన్( Hasan ) గోల్ కొట్టే ప్రయత్నం చేయగా భారత జట్టు గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ ( Gurpreet Singh )సమర్థంగా అడ్డుకున్నాడు.ఆ తర్వాత రెండు షాట్ లలో భారత్, లెబనాన్ సఫలం అయ్యాయి.దీంతో స్కోర్ 3-2 గా నమోదు అయ్యింది.తరువాత భారత జట్టు ప్లేయర్ ఉదాంత సింగ్ గోల్ కొట్టాడు.లెబనాన్ స్ట్రైకర్ బాబర్ కొట్టిన గోల్ విఫలం కావడంతో భారత్ విజయం సాధించింది.

మంగళవారం కువైట్- భారత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగునుంది.అయితే భారత్ శాప్ లో ఫైనల్ కు చేరడం ఇది 13వ సారి.ఇప్పటివరకు భారత్ ఎనిమిది సార్లు శాప్ టోర్నీ గెలిచింది.ఇక తొమ్మిదవ టైటిల్ గెలిచే దిశగా భారత్ ముందుకు సాగుతోంది.ఈ టోర్నీలో భారత జట్టు ప్లేయర్ ఛెత్రి అద్భుతంగా రాణించడం వల్లే జట్టు ఫైనల్ కు చేరింది.ఫైనల్ మ్యాచ్ లో కూడా ఛెత్రి అద్భుతంగా రానిస్తే టోర్నీ టైటిల్ భారత్ దే అని క్రీడా నిపుణులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube