సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు ఎక్కువకాలం రాణించడం అంటే గొప్ప విషయమే అని చెప్పవచ్చు.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత కనుమరుగైపోయిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.
ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించి దూరమైన వారు, అడపా దడపాసినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు ఇలా చాలామంది ఉన్నారు.కానీ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో పరసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న వారు చాలామంది ఉన్నారు.
అలా తెలుగులో కూడా చాలామంది హీరోయిన్ ఇప్పటికి రాణిస్తున్నారు.మరి ఆ హీరోయిన్లు ఎవరు అన్న విషయాన్ని వస్తే… త్రిష, నయనతార, శ్రుతిహాసన్, కాజల్, తమన్నా, అనుష్క, ప్రియమణి, శ్రియ తదితర సీనియర్ భామలందరూ తరచూ అదిరిపోయే అవకాశాల్ని సొంతం చేసుకుంటూ కెరీర్‌ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
కాగా హీరోయిన్ త్రిష( Trisha ) కెరీర్ మొదలై ఇరవయ్యేళ్లు పైనే అవుతున్న కూడా ఇప్పటికీ కుర్రభామలకి దీటుగా రాణిస్తోంది.అటు తమిళంలో విజయ్, రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్న ఆమె తెలుగులో చిరంజీవికి జోడీగా నటించేందుకు సిద్ధమైంది.
త్రిష అందం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వయసుతో పాటు ఈ ముద్దుగుమ్మ అందం కూడా రెట్టింపు అవుతోంది.అలాగే కమలహాసన్ కూతురు శృతిహాసన్( Shruti Haasan ) కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ల కాలం పూర్తి అవుతోంది.అయినప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.
ప్రస్తుతం సలార్ సినిమాతో నానితో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది.టాలీవుడ్‌లో మరికొన్ని సీనియర్ హీరోల సినిమాల విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తోంది.
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )అప్పుడప్పుడు చందమామ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాతో పాటు సత్యభామ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.అలాగే భగవద్గీత శ్రీ సినిమాలో కూడా నటిస్తోంది.హీరోయిన్ నయనతార( Nayanthara ).ఈమె కెరియర్ మొదలై 20 ఏళ్ళు అయ్యింది.అయినా కూడా ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని సంబంధం లేకుండా అన్ని భాషల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉన్నాయి.మరో సీనియర్ భామ తమన్నా ( Tamannaah )కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతోంది.
ఇప్పటికే చిరంజీవితో కలిసి భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.రజనీకాంత్ చిత్రం జైలర్ లో కూడా నటిస్తోంది తమన్నా.