Beer Hops Alzheimers: అల్జీమర్స్ వ్యాధికి, బీర్‌కు లింక్ వుందంటున్న లేటెస్ట్‌ రీసెర్చ్‌... అందులో ఏముందంటే?

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి.ఈ విషయం మేం చెప్పట్లేదు, అల్జీమర్స్ వ్యాధికి, బీర్‌కు లింక్ ఉందని ఓ లేటెస్ట్‌ రీసెర్చ్‌ చెప్పింది.

 Beer Hops Can Protect Against Alzheimers Disease Details, Alzimars, బీర్-TeluguStop.com

ఇక ప్రపంచంలో ఎంతో మంది వృద్ధులు అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న సంగతి విదితమే.ఈ వ్యాధి తీవ్రత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఇది ఘోరమైన మతిమరుపునకు కారణం అవుతుంది.నిపుణులు సైతం ఈ వ్యాధికి సరైన చికిత్స లేదని చెప్పడం కొసమెరుపు.

ఈ కారణంగా వ్యాధి లక్షణాలను గుర్తించేసరికే బాధితుల నాడీ వ్యవస్థ కోలుకోలేని స్థాయిలో దెబ్బతింటోంది అని ఓ సర్వే.

అందుకే ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించే నివారించే ప్రక్రియలను అభివృద్ధి చేయడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

అల్జీమర్స్‌ను ప్రారంభ దశల్లో గుర్తించే పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ ఇమేజింగ్‌ టెక్నిక్‌ను అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేసి రికార్డు క్రియేట్ చేశారు.అయితే బీర్‌ తయారీలో ఉపయోగించే హాప్‌ పూల ద్వారా అల్జీమర్స్‌ రాకుండా నివారించే అవకాశం ఉందని మరో అధ్యయనం చెప్పడం కొసమెరుపు.

హాప్ పువ్వుల నుంచి సేకరించిన రసాయనాలు, అల్జీమర్స్ వ్యాధి (AD)తో సంబంధం ఉన్న అమిలాయిడ్ బీటా ప్రోటీన్‌ల సమూహాన్ని నిరోధించగలవు.

Telugu Alzheimers, Beer, Beer Hops, Hops Flowers, Latest, Pitsberg-Latest News -

పాన్-యూరోపియన్ శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధన ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసాయి.కాగా ఈ పరిశోధన వివరాలు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో తాజాగా ప్రచురించ బడ్డాయి.అల్జీమర్స్‌ లక్షణాలను ముందే గుర్తించడంలో ఇబ్బందుల కారణంగా, దీనికి చికిత్స కష్టం అవుతోంది.

ఈ కోవలోనే ముందుగా ఈ లక్షణాలను గుర్తించే దిశగా పరిశోధనలు జరుపుతున్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube