అర్జున్ టెండూల్కర్ కు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్న బీసీసీఐ.. ఆ టోర్నీలో ఎంట్రీ కోసమే..!

అర్జున్ టెండూల్కర్( Arjun Tendulkar) అంటే సచిన్ టెండూల్కర్ తనయుడని అందరికీ తెలిసిందే.ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు.

 Bcci Will Give Special Training To Arjun Tendulkar.. Just For Entry In That Tou-TeluguStop.com

నాలుగు మ్యాచ్లు ఆడి మూడు వికెట్లు తీసిన అర్జున్ కు ప్రత్యేక గుర్తింపు మాత్రం లభించలేదు.ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ ( Mumbai Indians _మధ్య జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్ లో 31 పరుగులను అర్జున్ సమర్పించుకున్నాడు.

దీంతో తనపై అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయాడు.

ఈ బ్యాచ్ అనంతరం టీంకు దూరమయ్యాడు.

ఐపీఎల్ లో ఎవ్వరిని మెప్పించలేకపోయినా అర్జున్ బీసీసీఐను మెప్పించాడు.అందుకే అర్జున్ టెండూల్కర్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ క్యాంపులో పాల్గొనాలని అర్జున్ కు బీసీసీఐ ఆహ్వానం పంపించింది.

Telugu Abhishek Sharma, Arjun Tendulkar, Asia Cup, Ipl, Latest Telugu, Mumbai In

అసలు విషయం ఏమిటంటే వచ్చే ఏడాది ఎమర్జింగ్ ఆసియా కప్2023 జరుగనుంది.ఇందుకోసం సమర్థులైన ఆటగాళ్లను వెతికే పనిలో నిమగ్నమైంది బీసీసీఐ.వి.వి.ఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎన్సీఏ క్యాంపులో మూడు ఫార్మాట్ లలో యువ ఆటగాళ్లు రాటు తేలబోతున్నారు అంటూ బీసీసీఐ అధికారి తెలిపినట్లు పి.టి.ఐ రాసుకోచ్చింది.

Telugu Abhishek Sharma, Arjun Tendulkar, Asia Cup, Ipl, Latest Telugu, Mumbai In

ఇంకో విషయం ఏమిటంటే జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత సరైన లెఫ్ట్ ఆర్మ్ పెసర్ లేకపోవడం టీం ఇండియాను ఇబ్బంది పెడుతోంది.అందుకోసం అర్జున్ టెండూల్కర్ తో పాటు దేశవాళీ టోర్నీలలో తమ సత్తా చాటుతున్న 20 మంది యువ ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది.అర్జున్ టెండూల్కర్ తో పాటు చేతన్ సకారియా, ఐపీఎల్ 2023లో రాణించిన హైదరాబాద్ జట్టు ప్లేయర్ అభిషేక్ శర్మ( Abhishek Sharma ), ఢిల్లీ జట్టు ప్లేయర్ హర్షిత్ రాణా లకు క్యాంపులో పాల్గొనాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.

మొత్తానికి భవిష్యత్తులో జరిగే టోర్నీలలో భారత్ వరుస విజయాలు సాధించడం కోసం ఐపీఎల్ లో సత్తా చాటిన ఆల్ రౌండర్ లను మరింత సమర్థవంతంగా తయారు చేయనుంది బీసీసీఐ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube