ఐపీఎల్ కు మరో షాక్ కిట్ స్పాన్సర్స్ దొరకక తల పట్టుకున్న బీసీసీఐ!

కరోనా వల్ల ఎదురైన సంక్షోభం అంతా ఇంతా కాదు మరీ ముఖ్యంగా ఈ కరోనా వల్ల భారీగా నష్టపోయింది క్రీడా,సినీరంగాలే.ఇక ప్రస్తుతం ఆ రెండు రంగాలు బ్యాక్ టూ నార్మల్ అవ్వడానికి వ్యూహరచనలు చేస్తున్నాయి.

 Bcci Was Shocked By Nike,puma, Bcci, Ipl, Puma, Nike, Kit Sponcers, Cricket Boar-TeluguStop.com

క్రీడా రంగానికి చెందిన క్రికెట్ బోర్డ్ (బీసీసీఐ) ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ త్వరలోనే మొదలవ్వనున్నది.ఈ టోర్నీకి మొదట టైటిల్ స్పాన్సర్ గా చైనా కంపెనీ వివో ఉన్నది.

ఆతర్వాత ఆ కంపెనీ పై ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఆ కంపెనీ ఐపీఎల్ నుండి వైదొలగింది.దీనితో ఈ టైటిల్ స్పాన్సర్ డీల్ ను డ్రీమ్ 11 దక్కించుకుంది.

సాధారణంగా ఐపీఎల్ స్పాన్సర్ షిప్స్ కోసం ప్రముఖ కంపెనీలన్నీ క్యూ కడుతాయి.ఇది దృష్టిలో ఉంచుకొని తాజాగా బీసీసీఐ కిట్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం బిడ్ కు పిలుపునిచ్చింది.

సాధారణంగా ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ కు నైకీ, బీసీసీఐకు 85 లక్షల రూపాయిల చొప్పున చెల్లిస్తూ వచ్చింది.దీన్ని తగ్గించి బేస్‌ ప్రైజ్ అంటే 65 లక్షలకు తగ్గించి బీసీసీఐ కిట్‌ స్పాన్సర్‌షిప్‌ బిడ్ ను నిర్వహించింది.

మొదట కిట్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం పోటీ పడిన నాలుగు సంస్థలలో ఒకటి కూడా ‘ఫైనాన్షియల్‌ బిడ్‌’ వేయకుండా బీసీసీఐ కు షాక్ ఇచ్చాయి.

దీనికి కారణం బీసీసీఐ రాబోయే రోజుల్లో ప్రమోషన్‌ విషయంలో తమకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడమేనని ఆ సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్ పూర్తయ్యాక ఏం చేయాలనే అంశంపై ఇప్పటివరకు బీసీసీఐ ఓ క్లారిటీకి రాలేదు.మరి అలాంటి టైంలో ఈ సంస్థలకు ఏం హామీ ఇస్తుంది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube