ఇన్ స్టాగ్రామ్ లో పాపులర్.. 32 ఏళ్లకే ఎమ్మెల్యే అయిన అమ్మాయి.. ఈ యువతి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

చిన్న వయస్సులో రాజకీయాల్లో సత్తా చాటడం సులువైన విషయం కాదు.మిజోరాంలో జెడ్.

 Baryl Vanneihsangi Youngest Mla Mizoram Details Here Goes Viral In Social Media-TeluguStop.com

పీ.ఎం పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైన బారిల్ వన్నెహ్సోంగి ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు.బారిల్ వన్నెహ్సోంగి( Baryl Vanneihsangi ) వయస్సు32 సంవత్సరాలు కాగా ఒకప్పుడు రేడియో జాకీగా పని చేసిన బారిల్ వన్నెహ్సోంగి జెడ్.పీ.ఎం నుంచి శాసనభకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్కురాలు కావడం గమనార్హం.

Telugu Mizoram, Zoram Peoples-Inspirational Storys

మిజోరాం( Mizoram Election )లో తాజాగా జరిగిన ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూమెంట్ ఘన విజయం సాధించడం వెనుక ఎంతో కష్టం ఉంది.ఇతర పార్టీలను దాటుకొని ఈ పార్టీ అధికారంలోకి రావడం కోసం తీవ్రంగా శ్రమించింది.ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన బారిల్ వన్నెహ్సోంగి రాజకీయాలు మహిళలకు సూట్ కావని మహిళలు రాజకీయాల్లో రాణించలేరని ఉన్న అపోహలను మార్చాలని భావించారు.

Telugu Mizoram, Zoram Peoples-Inspirational Storys

బారిల్ వన్నెహ్సోంగి రాజకీయాల్లో( Politics )కి రావాలని అనుకున్న సమయంలో రాజకీయాలు అంటే టీవీ మైక్ ముందు మాట్లాడినంత తేలిక కాదని చాలామంది ఆమెను హేళన చేశారు.అయితే ఆ విమర్శలను పట్టించుకోకుండా మొదట కార్పొరేటర్ గా గెలిచిన బారిల్ వన్నెహ్సోంగి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 1414 ఓట్ల మెజారిటీతో గెలిచారు.సంకల్ప బలం ఉంటే కలలను సాధించడానికి జెండర్ ఎప్పుడూ అవరోధం కాదని బారిల్ వన్నెహ్సోంగి ప్రూవ్ చేశారు.బారిల్ వన్నెహ్సోంగి కు ఇన్ స్టాగ్రామ్ లో 3 లక్షల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం కృషి చేస్తానని బారిల్ వన్నెహ్సోంగి చెబుతున్నారు.బారిల్ వన్నెహ్సోంగి భవిష్యత్తులో రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు సృష్టించి కెరీర్ పరంగా మరింత ఎదుగుతారేమో చూడాల్సి ఉంది.

బారిల్ వన్నెహ్సోంగి సక్సెస్ స్టోరీ గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube