ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు వేల రూ.కోట్లకు అధిపతి.. ఫెవికాల్ ఓనర్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఒకప్పుడు దీనస్థితిని అనుభవించి కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన వ్యక్తుల సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి.ఫెవికాల్, ఫెవిక్విక్ ఓనర్ బల్వంత్ పరేఖ్ ( Feviquik Owner Balwant Parekh )సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

 Balvanth Parekh Inspirational Success Story Details Here Goes Viral In Social Me-TeluguStop.com

ఒకప్పుడు ప్యూన్ గా పని చేసిన బల్వంత్ ఇప్పుడు వందల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.ఒకప్పుడు ఇంటి అద్దె కట్టడానికి కూడా బల్వంత్ ఇబ్బంది పడ్డారు.

ప్రస్తుతం బల్వంత్ పరేఖ్ ఆస్తుల విలువ 88 వేల కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా బల్వంత్ మాత్రం వెనుకడుగు వేయలేదు.

ఫెవికాల్, ఫెవిక్విక్, ఎంసీఎల్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా బల్వంత్ ఈ స్థాయికి ఎదిగారు.పిడిలైట్ ఇండస్ట్రీస్( PIDLIGHT INDUSTRIES ) ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.

ఇష్టం లేకుండానే లా చదివిన బల్వంత్ పెళ్లి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆదాయం లేకపోగా అప్పుల భారం వల్ల అతనికి సరికొత్త సమస్యలు ఎదురయ్యాయి.ప్యూన్ పని నుంచి ఒక్కో మెట్టు ఎదిగిన బల్వంత్ సొంతంగా కంపెనీని స్థాపించి ఫెవికాల్ ఉత్పత్తులను తయారు చేశారు.గుజరాత్( Gujarath ) కు చెందిన బల్వంత్ ఫెవికాల్ సక్సెస్ తో కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.

బల్వంత్ పరేఖ్ ఇంత సక్సెస్ అయినా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.

ది ఫెవికాల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా( The Fevical Man of India ) పేరు తెచ్చుకున్న బల్వంత్ పరేఖ్ ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.బల్వంత్ పరేఖ్ వయస్సు 88 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు.నచ్చిన రంగంపై ఫోకస్ పెడితే సక్సెస్ దక్కుతుందని బల్వంత్ పరేఖ్ ప్రూవ్ చేశారు.

బల్వంత్ పరేఖ్ టాలెంట్ తో ఎంతో కష్టపడి దేశంలోని సంపన్నుల్లో ఒకరిగా ఎదిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube