బాలయ్య రెమ్యూనరేషన్‌ విషయంలో ఇంత రచ్చ ఎందుకో?

నందమూరి బాలకృష్ణ సక్సెస్‌ కొట్టి చాలా ఏళ్లు అయ్యింది.అయినా కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా వరుసగా చిత్రాలను చేస్తూనే ఉన్నాడు.

 Balakrishnahikes His Remunerationfor Hisnextmovie-TeluguStop.com

ప్రస్తుతం బాలయ్య తన 105వ చిత్రాన్ని కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు.ఈ చిత్రానికి సి కళ్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇటీవల సోషల్‌ మీడియాలో ఒక వార్త తెగ హల్‌ చల్‌ చేస్తోంది.ఆ వార్త నమ్మశక్యంగా లేకపోయినా కూడా నందమూరి అభిమానులు కాస్త గట్టిగా ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ వార్త ఏంటీ అంటే బాలయ్య తన 105వ సినిమాకు గాను 10 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు.సీనియర్‌ స్టార్‌ హీరోల్లో బాలయ్య పారితోషికం విషయంలో టాప్‌లో ఉంటాడు అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ప్రచారం చేస్తున్నారు.

నిర్మాత సి కళ్యాణ్‌ కూడా ఈ విషయాన్ని అనఫిషియల్‌గా ప్రకటించాడు.దాంతో యాంటీ నందమూరి ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.బాలయ్యపై ట్రోల్స్‌ దుమ్ము రేపుతున్నారు.

Telugu Balakrishna, Kalyan, Ks Ravi Kumar, Tollywood Box-

 బాలయ్య సినిమాల బడ్జెట్‌ 20 నుండి పాతిక కోట్లు ఉంటుంది.అలాంటి బాలయ్యకు పారితోషికం 10 కోట్లు ఇవ్వడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.బాలయ్య పారితోషికం రెండు లేదా మూడు కోట్లు మహా అయితే అయిదు కోట్ల వరకు ఉంటుందేమో కాని, అంతకు మించి ఒక్క రూపాయి కూడా అధికంగా ఉండదని అంచనా వేస్తున్నారు.

నిర్మాతలు ఆయనతో సినిమా అంటేనే కాస్త భయపడుతున్నారు.అలాంటిది 10 కోట్లు ఇచ్చి ఆయనతో సినిమా తీయడం అంటే ఏ నిర్మాత అంతటి సాహసం చేయడని యాంటీ నందమూరి ఫ్యాన్స్‌ జోకులు వేస్తున్నారు.

మరి బాలయ్య పారితోషికం విషయంలో నిజా నిజాలు ఏంటో ఆయన నిర్మాతలకే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube