నాకు రాజకీయాలు తెలియవు.. వైరల్ అవుతున్న బాలయ్య సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ( Balakrishna ) రుద్రంగి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై ఈ ఈవెంట్ లో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ( Rasamayi Balakishan ) నాకు సోదరుడి లాంటి వ్యక్తి అని నిజం చెప్పాలంటే మా ఇద్దరికీ రాజకీయాలు తెలియవని ఆయన అన్నారు.

 Balakrishna Sensational Comments Goes Viral In Social Media Details Here , Balak-TeluguStop.com

రసమయి బాలకిషన్ ను సాంస్కృతిక సారథి ఛైర్మన్ గా నియమించిన సీఎం కేసీఆర్ ( CM KCR )కు కృతజ్ఞతలు అని బాలయ్యచెప్పుకొచ్చారు.తన కొరకు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా జగపతిబాబు ( Jagapathi Babu )నటన ఉంటుందని బాలకృష్ణ అన్నారు.

లెజెండ్, అఖండ, రంగస్థలం సినిమాలలో జగపతిబాబు నటన బాగుంటుందని బాలయ్య చెప్పుకొచ్చారు.ఎంపిక చేసుకున్న పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమే నటన అని పాత్రలలో జీవించడం గొప్ప అని జగపతి బాబు పాత్రల్లో జీవిస్తారని బాలయ్య కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Balakrishna, Cm Kcr, Jagapathi Babu, Mamta Mohandas, Tollywood-Movie

భారతీయ సినీ ఇండస్ట్రీలోనే జగపతిబాబు గొప్ప నటుడని అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయని ఇండస్ట్రీ మనుగడ కోసం సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు.సినిమా ఇండస్ట్రీ బాగుండాలనేది మా ఆకాంక్ష అని బాలయ్య పేర్కొన్నారు.నిర్మాతలు, రచయితలు, దర్శకుల వల్లే సినిమా ఇండస్ట్రీ బ్రతుకుతోందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Cm Kcr, Jagapathi Babu, Mamta Mohandas, Tollywood-Movie

భయమే మనిషిని సగం చంపుతుందని ఆయన పేర్కొన్నారు. మమతా మోహన్ దాస్ క్యాన్సర్ వచ్చినా వీర వనితలా పోరాడి విజయం సాధించారని బాలయ్య చెప్పుకొచ్చారు.ప్రతి క్యాన్సర్ రోగికి మమతా మోహన్ ఆదర్శం అని బాలయ్య వెల్లడించారు.

స్టార్ హీరో బాలకృష్ణ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాకు రాజకీయాలు తెలియవంటూ బాలయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బాలయ్య ప్రస్తుతం సినిమాభగవంత్ కేసరి షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube