రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్( Rashmi Gautam ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది రష్మీ గౌతమ్.
మరి ముఖ్యంగా తన మంచితనంతో ఎంతోమంది అభిమానుల మనసులలో స్థానం సంపాదించుకుంది.కాగా ప్రస్తుతం రష్మీ జబర్దస్త్, దేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
వీటితో పాటుగా ఏవైనా పండుగ ఈవెంట్ లు, స్పెషల్ ఈవెంట్ లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.కాగా రష్మీ జంతు ప్రేమికురాలు( Animal Lover ) అన్న విషయం మనందరికీ తెలిసిందే.జంతువులకు హాని కలిగించే విధంగా జంతువులకు సంబంధించిన ఎటువంటి వీడియోలు అయినా కూడా వెంటనే వాటిపై స్పందిస్తూ తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా రష్మీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్టును చేసింది.ఆ పోస్టులో రష్మీ ఈ విధంగా రాసుకొచ్చింది.ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో సురక్షితంగా బతకడం కష్టంగా మారింది అని రాసుకొచ్చింది.రష్మీ అలాంటి పోస్ట్ చేయడం వెనుక కారణం కూడా లేకపోలేదు.
ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఒక నెటిజన్ చేసిన పోస్ట్‌పై రష్మి అలా స్పందించింది.అమ్మాయిలు తమ సోషల్ మీడియా ఖాతాను ప్రైవేట్ చేసుకోండి.డీపీలో మీ ఫొటో ఉంటే తీసేయండి.మీ వ్యక్తిగత ఫొటోలను ఎవ్వరితో పంచుకోవద్దు.కొందరు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను( Artificial Intelligence ) ఉపయోగించి అసభ్యకరమైన ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు.జాగ్రత్తగా ఉండండి అని రాసుకొచ్చారు నెటిజెన్.
ఆ పోస్ట్ ని ఉద్దేశిస్తూ రష్మీ పోస్ట్ చేస్తూ.ప్రస్తుతం డిజిటల్ యుగంలో సురక్షితంగా జీవించడం కష్టం.
అసభ్యకరమైన ఫొటోలు క్రియేట్ చేసే వారికి చిక్కకుండా అమ్మాయిలను దాక్కోమని చెప్పేబదులు ఇలాంటి నేరాలపై అవగాహన కల్పించడం అవసరం.కనిపించేది అంతా నిజం కాదని తెలిసేలా చేద్దాం.
సరాదా కోసం ఇలాంటి ఫొటోలు, వీడియోలు వైరల్ చేయ వద్దని చెబుదాం అని రాసుకొచ్చింది.