బాలయ్య పుట్టిన రోజు స్పెషల్‌ అదేనా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 106వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా సంగతులు ఈమద్య కాలంలో మీడియాలో రకరకాలుగా వినిపిస్తున్నాయి.

 Balakrishna Birthday Special Is His Movie Start With B Gopal Direction, Balakris-TeluguStop.com

బాలకృష్ణకు ఈ సినిమా చాలా కీలకం అనే విషయం తెల్సిందే.బోయపాటి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించబోతున్న సినిమా విషయంలో కూడా క్లారిటీ వచ్చింది.గతంలో పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు బి గోపాల్‌ ఒక సినిమాకు రెడీ అవుతున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సాయి మాధవ్‌ బుర్రా ఇప్పటికే బాలకృష్ణ కోసం ఒక కథను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది.బాలకృష్ణ గతంలో బి గోపాల్‌ దర్శకత్వంలో చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఈ సమయంలో ఆయన కెరీర్‌ పరంగా అవస్థలు ఎదుర్కొంటున్నాడు.అందుకే ఆయన్ను ఆదుకునేందుకు బాలకృష్ణ ఒక సినిమా ఆఫర్‌ ఇవ్వాలనే నిర్ణయంతో ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Telugu Gopal, Balakrishna, Boyapati Srinu, Tollywood-Movie

ఈమద్య కాలంలో రచయిత సాయి మాధవ్‌ బుర్ర అద్బుతమైన కథలను ఆవిష్కరించాడు.అందుకే ఈ సినిమా కోసం కూడా మంచి కథను రెడీ చేశాడు.ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆసినిమాను తెరకెక్కిస్తే తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.ఇక జూన్‌ 10వ తారీకున బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించి వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube