కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు మరో సారి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది.పుల్వామా లోని సీఆర్ పీ ఎఫ్ క్యాంపు పై జరిగిన దాడి తరహాలో దాడి కి ఉగ్రవాదులు పథకం చేసినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం లభించడం తో కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరించింది.
పుల్వామా సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి జరిగి ఈ నెల 14కు ఏడాది పూర్తి అయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి దాడికి ఉగ్రవాదులు పథక రచన చేసినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందడం తో వెంటనే ఆ సమాచారాన్ని ప్రభుత్వం కు చేరవేసి అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది.
బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంలో శిక్షణ పొందిన 27 మంది పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
తొలుత నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు దిగాలని, దానిని భారత జవాన్లు తిప్పికొట్టే ప్రయత్నంలో ఉండగా ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపేలా ప్లాన్ చేసినట్టు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందినట్లు తెలుస్తుంది.బాలాకోట్‌లో ఉగ్రవాదులకు మసూద్ అజర్ కుమారుడు యూసుఫ్ అజర్ శిక్షణ ఇచ్చినట్టు నిఘా వర్గాలు తెలిపాయి.ఇంటెలిజెన్స్ నివేదికతో కేంద్రం అప్రమత్తమై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.